మోడీకి అభినందనలు తెలిపిన అమేరికా... ఇతర అగ్రదేశాల నేతలు..
భారతదేశ సార్వత్రిక ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన ప్రధాని మోడీకి ప్రపంచ దేశాల మహమహులు అభినందనలు తెలుపుతున్నారు. 50 సంవత్సరాల దేశ పార్లమెంట్ చరిత్రలో అతిపెద్ద సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీతో పాటు ప్రధాని నరేంద్రమోడీకి ప్రపంచ దేశాల నుండి అభినందనల వెల్లువ కురుస్తోంది. పలు అగ్రదేశాధినేతలు ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు.
ఈనేపథ్యంలోనే అమేరికా అమేరికా అంబాసిడర్ కెన్ జెస్టర్ మోడీకి అభినందనలు తెలిపారు. ఈనేపథ్యంలోనే భారత దేశం తమకు వ్యుహత్మక భాగస్వామీ అంటూ భారత్ అమేరిక సంబంధాలను కొనసాగిస్తామని తెలిపారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మోడీ విజయంపై అభినందనలు తెలిపారు.మరోవైపు చైనా అధ్యక్షుడు కూడ ప్రధాని మోడీకి అభినందనలు తెలుపుతూ లేఖ పంపారు. ఈనేపథ్యంలోనే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించడంతోపాటు అభివృద్దికి సహకరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ఇక అంతకు ముందు పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ అభినందనలు తెలిపారు. ఈనేపథ్యంలోనే రెండు దేశాలు పరస్పర సహకారంతో ముందుకు సాగుతామని పేర్కోన్నారు. దక్షిణాసియా దేశాల్లో శాంతిని నెలకొల్పి అభివృద్దివైపు అడుగులు వేసేందుకు సహకరించాల్సింగా ఆయన కోరారు. ఇక మోడీకి అభినందనలు తెలిపిన వారిలో ఇమ్రాన్ ఖాన్‌తోపాటు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింగే తోపాటు బంగ్లాదేశ్ అధ్యక్షుడు అశ్రాఫ్ ఘనిలు ఉన్నారు.
Congratulations to @narendramodi and the #NDA on your sweeping victory! The United States looks forward to working closely with our strategic partner #India in the years to come. #USIndia pic.twitter.com/thmcNvJeRY
— Ken Juster (@USAmbIndia) May 23, 2019












Click it and Unblock the Notifications