వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెద్దన్న ఆపన్నహస్తం: ఇండియాకు 2.9 మిలియన్ డాలర్ల సాయం, ఎందుకంటే..

|
Google Oneindia TeluguNews

యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. అయితే ఏటా భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా వైద్యం కోసం నిధులు అందజేస్తోంది. ఈ సారి కరోనా వైరస్ ప్రభావంతో నిధులు కూడా పెంచింది. ఇండియాలో కరోనా వైరస్ నివారణ కోసం అమెరికా ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ (యూఎస్ఏఐడీ) 2.9 మిలియన్ డాలర్లు అందజేస్తామని ప్రకటించింది. గత 20 ఏళ్ల నుంచి భారత్‌కు అమెరికా 1.4 బిలియన్ డాలర్లు ఆర్థికసాయం అందించింది. ఈ నిధుల మొత్తం కలిపితే 3 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. అమెరికా అందజేసే నిధులు కరోనా వైరస్ నిర్మూలన కోసం భారత్‌కు ఉపయోగపడతాయి.

2.4 మిలియన్ డాలర్లు

2.4 మిలియన్ డాలర్లు


జాన్ హోప్కిన్ వర్సిటీతో సమన్వయం చేసుకొని పిగో సంస్థ ద్వారా 2.4 మిలియన్ డాలర్లు కేటాయించారు. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా 5 లక్షల అమెరికా డాలర్లు కేటాయించింది. ఇదే కాదు కరోనా వైరస్ నిర్మూలన కోసం యూఎస్ఏఐడీ మరింత సాయం చేస్తుందని జస్టర్ పేర్కొన్నారు. మహమ్మరిని సమూలంగా నిర్మూలించేందుకు యూసీఐఐడీ, యూఎస్ఐడీ, సెంటర్ ఫర్ డీజిస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్, యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యుమన్ సర్వీసెస్ ఏజెన్సీ పనిచేస్తాయని తెలిపారు.

2009 నుంచి సాయం

2009 నుంచి సాయం

ప్రజారోగ్యం గురించి పెద్దన్న అమెరికా నిధులు కేటాయిస్తూ అండగా నిలుస్తోంది. 2009 నుంచి అమెరికా పన్ను చెల్లింపుదారుల నుంచి 100 బిలియన్ డాలర్ల కన్నా ఎక్కువ నిధులు సమకూరుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కనీసం 70 బిలియన్ డాలర్లను వెచ్చిస్తున్నారు. 2019లో అమెరికా ప్రపంచ ఆరోగ్య సంస్థకు 400 మిలియన్ డారలర్లను కేటాయించింది. ఇది రెండో పెద్ద సాయంగా నిలిచింది.

1.7 బిలియన్ డాలర్లు

1.7 బిలియన్ డాలర్లు

2019లో అమెరికా ఐక్యరాజ్యసమితి రెప్యూజీ ఏజెన్సీకి కనీసం 1.7 బిలియన్ డాలర్లను కేటాయించింది. అలాగే ఐక్యరాజ్యసమితి చిన్నారుల నిధికి అమెరికా 700 మిలియన్ డాలర్లను కేటాయించారు. చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి పెంచేందుకు యునిసెఫ్ గత కొన్నేళ్లుగా నిధులు కేటాయిస్తోన్న సంగతి తెలిసిందే. అంటు వ్యాధులపై కూడా అమెరికా అప్రమత్తంగా ఉంటోంది. ఇదీ ప్రపంచ వినాశనానికి దారితీసే అవకాశం ఉన్నందున.. నిధులు కేటాయిస్తోంది.

English summary
U.S. Agency for International Development, announced $2.9 million to support India in its response to the novel coronavirus disease, COVID-19
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X