అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి భార్యకు తెలుగు మూలాలు: విశాఖతో లింక్ ఏంటీ?

Usha Chilukuri Vance: అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రచార తీవ్రత పెరిగింది. అధికారంలో ఉన్న డెమొక్రాట్లు, ప్రతిపక్ష రిపబ్లికన్లు దేశవ్యాప్తంగా ర్యాలీలకు శ్రీకారం చుట్టాయి. వచ్చే అయిదు నెలలపాటు అమెరికాలో అధ్యక్ష ఎన్నికల కోలాహలం నెలకొనబోతోంది.

ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రేసులో నిల్చున్నారు. మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు. 2015 నాటి ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 2019లో జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు మళ్లీ బైడెన్‌పై పోటీకి దిగారు.

Vice Presidential Hopeful Vances Wife Usha Chilukuri Hails from Visakhapatnam

ఉపాధ్యక్ష అభ్యర్థిని కూడా ప్రకటించింది రిపబ్లికన్ పార్టీ. ఓహియో సెనెటర్‌ జేమ్స్ డేవిడ్ వాన్స్‌ పేరును ఖరారు చేసింది. డొనాల్డ్ ట్రంప్ రన్నర్- మేట్‌గా ప్రకటించింది. విస్కాన్సిస్‌లోని మిల్వాకీలో నిర్వహించిన నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా ఉపాధ్యక్ష అభ్యర్థి జేమ్స్ డేవిడ్ వెన్స్ పేరును అధికారికంగా ప్రకటించింది.

జేడీ వాన్స్ భార్య.. ఉషా చిలుకూరి వాన్స్. భారత సంతతికి చెందిన మహిళ. ఆమెకు తెలుగు మూలాలు ఉండటం చర్చనీయాంశమైంది. విశాఖపట్నం, కృష్ణా జిల్లాల్లో ఇప్పటికీ ఆమెకు బంధువులు ఉన్నారు. విశాఖలో నివసిస్తోన్న ప్రొఫెసర్ శాంతమ్మకు మనవరాలి వరుస అవుతారు.

శాంతమ్మ భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి తమ్ముడు రామశాస్త్రి కుమార్తెనే ఉషా చిలుకూరి. ఆమెకు కృష్ణాజిల్లా ఉయ్యూరులో బంధువులు ఉన్నారు. తాత చిలుకూరి రామ్మోహన్ రావు కుటుంబం ఉయ్యూరులో ఉంటోంది.

Vice Presidential Hopeful Vances Wife Usha Chilukuri Hails from Visakhapatnam

చిలుకూరి రామశాస్త్రి చాలాకాలం పాటు చెన్నైలో నివసించారు. ఐఐటీ- చెన్నైలో చదువుకున్నారు. కొంతకాలం అక్కడే ప్రొఫెసర్‌గా పని చేశారు. అనంతరం భార్య బాలాత్రిపుర సుందరితో కలిసి అమెరికా వెళ్లిపోయారు. రామశాస్త్రి- బాలా త్రిపురసుందరి దంపతులకు 1986 జనవరి 6వ తేదీన కాలిఫోర్నియా శాన్‌డియాగోలో ఉషా చిలుకూరి జన్మించారు. ఆమె చెల్లెలు శారద ఇప్పటికీ చెన్నైలో నివాసం ఉంటోన్నారు.

ఉషా చిలుకూరి వృత్తిరీత్యా అడ్వొకేట్. యేల్ యూనివర్శిటీ బ్యాచిలర్ డిగ్రీ, కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ఎంఫిల్ పూర్తిచేశారు. గేట్స్ కేంబ్రిడ్జి స్కాలర్‌షిప్ కింద ఆమె ఎంఫిల్ చదివారు. 2014లో జేడీ వెన్స్‌ను పెళ్లాడారు. వారిది లవ్ మ్యారేజ్. రోమన్ క్యాథలిక్ అయిన జేడీ.. యేల్ యూనివర్శిటీలో చదువుకుంటోన్నప్పుడు ఆమెకు పరిచయం అయ్యారు. వారికి ఇవాన్, వివేక్, మిరాబెల్ అనే పిల్లలు ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+