Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లిప్ట్‌లో యువతితో అసభ్యం: లాగి ఒకటిచ్చింది (వీడియో)

బీజింగ్: లిప్ట్‌లో ఒంటరిగా ఉన్న మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిని చితకొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆ యువతి ధైర్యసాహసాలను కొనియాడుతున్నారు. ఈ నెల 24వ తేదీన చైనాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి సీసీటీవీలో రికార్డయింది.

వీడియో ప్రకారం రాత్రి 9.30 సమయంలో లిఫ్ట్‌లో ఒంటరిగా ఓ యువతి ఉంది. దీనిని అదునుగా భావించి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడో యువకుడు. తొలుత యువకుడి చేష్టల పట్ల ఎంతగానో ఓపిక పట్టిన ఆ యువతి ఒక కిక్ ఇవ్వడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. లిఫ్ట్‌లో ఒంటరిగా యువతి ఉండగా అదే సమయంలో ఓ యువకుడు లిఫ్ట్‌లో ప్రవేశించాడు.

యువతి ఫోన్‌లో బిజీగా ఉన్నసమయంలో మొదట ఆమెకు పైనుంచి కింద వరకు ఎగాదిగా చూశాడు. అది గమనించిన ఆ యువతి అతడిని ఏమీ అనకుండానే పక్కకు తప్పుకుంది. ఆ యువకుడు మరోసారి వెనక వైపుగా వచ్చి ఈ సారి ఏకంగా చేయిని యువతి భుజంపై వేశాడు.

ఈ హఠాత్పరిణామంతో చిర్రెత్తుకొచ్చిన యువతి ఒక్క సెకన్ కూడా వేస్ట్ చేయకుండా ఆ కామాంధుడి చేయి తీసేసి, చెంప చెళ్లు మనిపించింది. అంతటితో ఆగకుండా కాలుతో గట్టిగా ఒకే ఒక కిక్ ఇచ్చింది. దీంతో అతను కిందికి వంగడంతో ఇంకోసారి మోహం పైనుంచి గట్టిగా కాలితో తన్నింది. అంతే ఆ యువకుడు లిఫ్ట్‌లోనే కుప్పకూలిపోయాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+