viral photo: ఆకాశంలో తేలుతోన్న ఓడ -గ్రాఫిక్ కాదు, అచ్చ తెలుగులో దృష్టి భ్రాంతి
'ఏమో.. గుర్రం ఎగరావచ్చు..' అనే జమానా ఊహను.. గ్రాఫిక్స్ లో నిజం చేసి చూపిస్తారు ఈనాటి గడుగ్గాయిలు. ఇదిగో... 'ఆకాశంలో తేలుతోన్న ఓడ' ఫొటోను మొదటిగా చూసినవాళ్లంతా ఇదేదో గ్రాఫిక్ మాయాజాలం అనుకున్నారు. కానీ ఇందులో ఒక్క బిట్ గ్రిఫిక్ కూడా లేదు. అచ్చంగా కెమెరాతో చిత్రీకరించిందే..
టెక్నాలజీతోపాటే ఫేక్ ప్రచారాలూ వేగంగా వ్యాప్తి చెందుతోన్న రోజులివి. 'ఫ్యాక్ట్ చెక్' ఫిల్టర్లను దాటుకుంటూ మరీ గ్రాఫిక్ వీడియోలు, ఫొటోషాప్ చిత్రాలు వైరలైపోతున్న వైనం మనమంతా చూస్తున్నాం. అందుకే కాబోలు, చాలా రోజుల తర్వాత ఒరిజినల్ వండర్ లా అగుపించింది కాబట్టే ప్రస్తుతం ఇది వైరల్ ఫొటోగా మారింది. వివరాల్లోకి వెళితే..

నీటిపై ప్రయాణించాల్సిన ఓడ.. ఆకాశంలో తేలుతున్నట్లు కనిపిస్తోన్న ఈ దృశ్యం కెనడాలోని బాన్ఫ్ పట్టణంలో కనిపించింది. కొలిన్ మెక్‌కల్లమ్ అనే రోడ్డుపై కారులో వెళుతుండగా.. ఎదురుగా ఉన్న సముద్ర తలానికిపైన.. ఆకాశంలో కార్గొ షిప్ తేలాడుతున్నట్లుగా కనిపించింది. ఆ దృశ్యాన్ని నమ్మలేకపోయిన కొలిన్.. తాను దృష్టి భ్రాంతికి గురయ్యానని గ్రహించాడు. వెంటనే..
కొలిన్ తన మొబైల్‌లో ఆ ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. 'ఇవాళ రియల్ లైఫ్ ఆప్టికల్ ఇల్యూషన్' చూశానంటూ కొలిన్ పోస్ట్ చేసిన ఫొటో గంటల వ్యవధిలోనే ప్రపంచం నలుమూలలకు పాకింది. సముద్రం అలలపై మబ్బుల నీడ పడటంతో ఆ ఓడ ఉన్న చోటు ఆకాశంగా కనిపించిందని, దీంతో ఆ షిప్ గాల్లో తేలుతున్నట్లుగా ఉన్నదని నిపుణులు తేల్చేశారు. సముద్ర తీరంలో మేఘాలు కమ్ముకుని ఉండటం కూడా ఓ కారణమని ఇంకొందరు చెబుతున్నారు. అదీ సంగతి.
viral photo: ఆకాశంలో తేలుతోన్న ఓడ -గ్రాఫిక్ కాదు, అచ్చ తెలుగులో దృష్టి భ్రాంతి
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications