వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Viral Video: తృటిలో తప్పిన ప్రమాదం.. ఒకేసారి పైకిలేచిన పాము ఏం చేసిందంటే..

|
Google Oneindia TeluguNews

బ్రెజిలియన్ ఫిషింగ్ గైడ్ పాము కాటు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అతన్ని పాము కాటేయ్యబోయే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 38 ఏళ్ల జోవో సెవెరినో ఈ వీడియోను సోషల్ మీడియోలో పోస్ట్ చేశాడు. మిస్టర్ సెవెరినో జూన్ 30న సెంట్రల్ బ్రెజిలియన్ రాష్ట్రమైన గోయాస్‌లోని అరగ్వాయా నదిలో పడవలో పర్యాటకుల బృందానికి ఆ ప్రాంతం గురించి వివరిస్తుండగా ఈ ఘటన జరిగింది. 20-సెకన్ల వీడియోలో నీటికి దిగువన, రెండు చెక్క దుంగల మధ్య చుట్టబడిన కొండచిలువను చూసిన అతను దాన్ని రెచ్చగోట్టే ప్రయత్నం చేశాడు. అది సెకండ్ల వ్యవధిలో అతనిపై దాడి చేయడానికి ఒకేసారి పైకి వచ్చింది. దీంతో పడవలో ఉన్నవారు భయపడ్డారు.

పామును చూడండి అని మాత్రమే అన్నాను..
వీడియోలో దాడి జరిగిన తర్వాత మిస్టర్ సెవెరినో భయంతో నవ్వడం వినిపిస్తోంది." నేను ఒక స్టంప్‌పై పామును చూశాను. నేను.. చూడండి, అబ్బాయిలు, అక్కడ ఒక కొండచిలువ ఉంది. వెంటనే అది నా మీదకు వచ్చింది" అని సెవెరినో చెప్పారు. బోవా కుటుంబానికి చెందిన దక్షిణ అమెరికాకు చెందిన గ్రీన్ కొండచిలువ ప్రపంచంలోనే అతిపెద్ద పాముగా గుర్తించారు.

 Viral Video: Anaconda Leaps Out Of Water And Bites Brazilian Man

ఆడ పాములు పెద్దవిగా ఉంటాయి..
నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, మగవాటి కంటే ఆడ పాములు చాలా పెద్దవిగా ఉంటాయట. కొండచిలువలు సాధారణంగా చిత్తడి నేలలు, చిత్తడి నేలలు, నెమ్మదిగా కదులుతున్న ప్రవాహాలలో, ప్రధానంగా అమెజాన్ బేసిన్‌లోని ఉష్ణమండల వర్షారణ్యాలలో నివసిస్తాయి. ఇవి అడవి పందులు, జింకలు, పక్షులు, తాబేళ్లు,. జాగ్వర్లను కూడా వేటాడతాయి.

English summary
Viral Video: Anaconda Leaps Out Of Water And Bites Brazilian Man
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X