వైరల్ లవ్ స్టోరీ: 50 ఏళ్లు చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్న పెద్దాయన!

Viral Love Story: ఇండోనేషియాలో జరిగిన ఓ అసాధారణ వివాహం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పెళ్లి కేవలం వధూవరుల వయసులో ఉన్న భారీ తేడా కారణంగానే కాకుండా.. పెళ్లికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల వల్ల తలెత్తిన వివాదాల కారణంగా కూడా చర్చనీయాంశమైంది. అసలేం జరిగిందో తెలుసుకుందాం.

24 ఏళ్ల వధువు, 74 ఏళ్ల వరుడు.. భారీ 'బ్రైడ్ ప్రైజ్' (వధువు ఖరీదు):

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఇండోనేషియాకు చెందిన 74 ఏళ్ల తర్మన్ అనే వృద్ధుడు, తనకు సరిగ్గా 50 ఏళ్లు చిన్నదైన 24 ఏళ్ల షేలా అరికా అనే యువతిని వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి కోసం పెళ్లి కొడుకు తర్మన్ వధువుకు భారీ మొత్తంలో 'బ్రైడ్ ప్రైజ్' ఇచ్చారు. బ్రైడ్ ప్రైజ్ అంటే వధువుకు డబ్బులు చెల్లించి పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి కొడుకు (తర్మన్): 74 సంవత్సరాలు

పెళ్లి కూతురు (షేలా అరికా): 24 సంవత్సరాలు

బ్రైడ్ ప్రైజ్ మొత్తం: 3 బిలియన్ ఇండోనేషియా రూపాయిలు, ఇది భారత కరెన్సీలో సుమారు రూ.2 కోట్ల వరకు ఉంటుంది. ఈ వయోభేదం, రూ.2 కోట్ల బ్రైడ్ ప్రైజ్ వార్త ఇంటర్నెట్‌లో వేగంగా విస్తరించింది.

Viral Wedding in Indonesia 74-Year-Old Marries 24-Year-Old with Rs 2 Cr Bride Price

వివాదానికి కారణం ఏంటి?
ఈ పెళ్లి వార్త వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం వివాహ వేడుక సందర్భంగా జరిగిన ఓ విచిత్ర ఘటన. పెళ్లి వేడుకకు హాజరైన ఫోటోగ్రాఫర్ బృందం, వధూవరులు తమకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండానే పెళ్లి మండపం నుంచి హఠాత్తుగా పారిపోయారని ఆరోపించింది.

ఇండోనేషియాలోనితూర్పు జావా ప్రావిన్స్‌లో పాసీతాన్ రీజెన్సీలో అక్టోబర్ 1న ఈ పెళ్లి ఘనంగా జరిగింది. వధూవరులు తమకు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా, పెళ్లికూతురు కుటుంబ సభ్యుడి బైక్‌పై వేదిక నుండి పారిపోయారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పెళ్లి సందర్భంగా ఇచ్చిన బ్రైడ్ ప్రైజ్‌కు సంబంధించిన చెక్కులు కూడా నకిలీవని సోషల్ మీడియాలో వార్తలు ప్రచారమయ్యాయి.

వివరణ ఇచ్చిన పెళ్లికొడుకు
ఫోటోగ్రాఫర్ల ఆరోపణలు, నకిలీ చెక్కుల వార్తలపై పెళ్లి కొడుకు తర్మన్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తను ఇచ్చిన బ్రైడ్ ప్రైజ్ (3 బిలియన్ ఇండోనేషియా రూపాయిలు) నిజమైనదని, ఆ డబ్బు షేలా అరికాకు అందినట్లు తర్మన్ స్పష్టం చేశారు. తాను అరికాను వదిలి పారిపోలేదని, ఆమె తనతోనే ఉందని, ఇద్దరూ హనీమూన్‌కు వెళ్లారని అరికా కుటుంబ సభ్యులు కూడా ధ్రువీకరించారు.ప్రస్తుతం ఫోటోగ్రాఫర్ల ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. భారీ ఖర్చు, వయోభేదం, పారిపోవడం వంటి ఆరోపణలతో ఈ ఇండోనేషియా పెళ్లి కథనం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+