Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ విక్టరీ- కోల్డ్‌ వార్‌కు తెర?

Vladimir Putin: ఇటీవలే ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ఇక ప్రమాణ స్వీకారానికి సమాయాత్తమౌతోన్నారు. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అధ్యక్షుడిగా ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేయనున్నారు. అమెరికా 47వ అధ్యక్షుడాయన.

ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిగా ముగిసింది. 295 ఎలక్టోరల్ ఓట్లతో సునామీ సృష్టించారు డొనాల్డ్ ట్రంప్. 50.70 శాతం ఓట్లతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆయనకు పోల్ అయిన మొత్తం ఓర్ల సంఖ్య ఏడు కోట్లను దాటింది. 7,32,98,740గా లెక్క తేలింది. ఈ ఎన్నికలను ట్రంప్ ఏకపక్షంగా మార్చివేశారు.

Russian President Vladimir Putin has congratulated Donald Trump on winning the US presidential poll and said that Moscow is ready to have dialogue with the Republican president-elect

డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు పడ్డ ఓట్ల శాతం 47.70. మొత్తంగా 6,89,71,195 ఓట్లకే ఆమె పరిమితం కావాల్సి వచ్చింది. 2019 నాటి ఎన్నికల్లో డెమోక్రాట్లకు పట్టం కట్టిన కొన్ని కీలక రాష్ట్రాలు ఈ దఫా స్వింగ్ అయ్యాయి. రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపాయి.

ఈ ఎన్నికల్లో అమెరికన్లు ఇచ్చిన తీర్పు సరైనదే. వాళ్ల ఓటు వృధా కాలేదనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్‌కు అమెరికన్ ఓటర్లు కట్టబెట్టిన అతి భారీ మెజారిటీ శతృదేశాలను సైతం అమెరికాకు చేరువ చేయడం, డెమోక్రాట్లకు కాదని రిపబ్లికన్లకు పట్టం గట్టడం ఆ దేశానికి మరింత ప్రయోజనాలను కల్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్.. డొనాల్డ్ ట్రంప్‌కు శుభాకాంక్షలను తెలియజేశారు. ట్రంప్.. అమెరికా ప్రజల నమ్మకాన్ని చురగొన్నారని ప్రశంసించారు. ఆయనతో ముఖాముఖి భేటీ కావడానికి, చర్చలను కొనసాగించడానికి తాను సంసిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు.

సోచిలోని వాల్డాయ్ ఇంటర్నేషనల్ డిస్కషన్ క్లబ్‌లో ఏర్పాటైన ప్లీనరీ సెషన్స్‌ పాల్గొన్నారు పుతిన్. ఈ సందర్భంగా దీన్ని ఉద్దేశించి ప్రసంగించారు. అమెరికాతో చర్చలకు సిద్ధంగా ఉన్నాననీ ప్రకటించారు. అమెరికన్లు ఎన్నుకున్న కొత్త అధ్యక్షుడితో ఎలాంటి చర్చలనయినా కొనసాగిస్తానని తాను ఇదివరకే వెల్లడించానని గుర్తు చేశారు.

ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన వ్యూహాలు అత్యంత సాహసోపేతమైనవని, ఫలితంగా స్ఫూర్తిదాయక విజయాన్ని సాధించారని వ్లాదిమిర్ పుతిన్ కితాబిచ్చారు. ఓ నిజమైన హీరోలా పోరాడారని వ్యాఖ్యానించారు. రష్యాతో సత్సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తానంటూ ట్రంప్ చేసిన ప్రకటననూ ఈ సందర్బంగా పుతిన్ స్వాగతించారు.

రష్యా- ఉక్రెయిన్ మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో పుతిన్ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌కు అండగా నిలిచారు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్. రష్యాను ధీటుగా ఎదుర్కొనడానికి ఉక్రెయిన్‌కు మిలియన్ డాలర్ల కొద్దీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అదే స్థాయిలో ఆయుధాలనూ అందజేశారు.

ఫలితంగా- అమెరికాతో శతృత్వాన్ని పెంచుకుంది రష్యా. జో బైడెన్ చర్యలను పుతిన్ బాహటంగా తప్పుపట్టిన సందర్భాలు ఉన్నాయి. తాము పరోక్షంగా అమెరికాతో యుద్దం సాగిస్తోన్నామనే భావన రష్యన్ పెద్దల్లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఈ యుద్ధానికి ముగింపు పలికేలా చర్యలు తీసుకుంటామంటూ ట్రంప్ ప్రకటించడం, దాన్ని పుతిన్ స్వాగతించడం చర్చనీయాంశమైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+