అంతరిక్షంపై ఆధిపత్యం దిశగా చైనా: పరిశోధనల్లో డ్రాగన్ మరో ఘనత: మొదటి మహిళగా
బీజింగ్: అంతరిక్ష పరిశోధనల్లో డ్రాగన్ కంట్రీ చైనా మరో అరుదైన ఘనతను సాధించింది. చైనాకు చెందిన మహిళా వ్యోమగామి వాంగ్ యాపింగ్ స్పేస్ వాక్ చేశారు. స్పేస్‌వాక్‌లో పాల్గొన్న తొలి చైనా మహిళగా ఆమె గుర్తింపు పొందారు. చైనా సొంతంగా రూపొందించుకున్న తియాన్‌గోంగ్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో వాంగ్ యాపింగ్‌తో పాటు మరో వ్యోమగామి గ్ఝాయ్ ఝిగాంగ్ ఉన్నారు. వారిద్దరూ ఆరున్నర గంటల పాటు స్పేస్‌వాక్ చేశారు. చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.
Recommended Video
షెంగ్ఝౌ-13 క్రూతో కలిసి వాంగ్ యాపింగ్ అంతరిక్ష పరిశోధనల కోసం తియాన్‌గోంగ్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లారు. ఈ క్రూతో కలిసిన మాడ్యుల్‌ను కిందటి నెల 16వ తేదీన గోబీ ఎడారి నుంచి ప్రయోగించారు. ఆరు నెలల పాటు వారు స్పేస్ స్టేషన్‌లో ఉంటారు. స్పేస్‌వాక్ సమయంలో వాంగ్ యాపింగ్..తియాన్‌గోంగ్ స్టేషన్‌కు సంబంధించిన రోబోటిక్ ఆర్మ్‌కు ఓ డివైస్‌ను అమర్చారు. స్పేస్ స్టేషన్ నుంచి అంతరిక్షంలోకి ప్రవేశించిన వెంటనే ఆమె తన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
వాంగ్ యాపింగ్ వయస్సు 41 సంవత్సరాలు. అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన చైనా రెండో మహిళా వ్యోమగామి ఆమె. ఇదివరకు 2012లో లియూ యాంగ్ అనే అంతరిక్ష పరిశోధకురాలు తియాన్‌గోంగ్ స్పేస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆమె స్పేస్ వాక్ చేయలేదు. అంతరిక్ష కేంద్రానికి చెందిన తియాన్హే కోర్ మాడ్యూల్ నుంచి తోటి వ్యోమగామి గ్ఝాయ్‌తో కలిసి బయటికి వచ్చారు. ఆరున్నర గంటలపాటు స్పేస్ వాక్ చేశారు. రోబోటిక్ ఆర్మ్‌కు సంబంధించిన ఓ డివైజ్‌ను అమర్చారు.

నిర్మాణంలో ఉన్న అంతరిక్ష కేంద్రం కోసం చైనా చేపట్టిన రెండో మానవ సహిత అంతరిక్ష ప్రయోగమిది. ఇంతకుముందు ముగ్గురు వ్యోమగాములు మూడు నెలలపాటు అంతరిక్ష కేంద్రంలో గడిపారు. నిర్మాణానికి సంబంధించిన పనులను కొన్నింటిని పూర్తి చేశారు. ఆ ముగ్గురు సెప్టెంబర్ 17వ తేదీన భూమికి తిరిగి వచ్చారు. ఆ వెంటనే వాంగ్ యాపింగ్ క్రూ.. అక్కడికి బయలుదేరి వెళ్లింది. నిర్మాణంలో ఉన్న ఈ స్పేస్ స్టేషన్.. వచ్చే సంవత్సరం అందుబాటులోకి వస్తుందని చైనా స్పేస్ అధికారులు చెబుతున్నారు.
ఇది పూర్తయితే సొంత అంతరిక్ష కేంద్రం కలిగిన దేశంగా చైనా ఆవిర్భవిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌ను వేర్వేరు దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధకులు ఉమ్మడిగా వినియోగించుకుంటున్నారు. చైనా మాత్రం సొంతంగా అలాంటి స్టేషన్‌ను నిర్మించుకుంటోంది. ఈ నిర్మాణ పనుల్లో భాగంగానే.. ఆస్ట్రోనాట్స్ క్రూ తరచూ అంతరిక్షానికి వెళ్లి వస్తోంది. తాజాగా వాంగ్ యాపింగ్ క్రూ ఈ పనులను చేపట్టింది.












Click it and Unblock the Notifications