Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నీవు ఇష్టపడినా లేకున్నా రేప్ చేస్తా: జర్నలిస్టుకు బెదిరింపు

ఫ్రాన్స్: ఫ్రాన్స్‌లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభమైంది. 'నీకు ఇష్టం ఉన్నా, లేకున్నా ఓ రోజు నీపై అత్యాచారం జరుపుతా'.. రేడియో జర్నలిస్టు గ్విలియా ఫోయిస్‌ను ఎడిటర్ బెదిరించారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

హాలీవుడ్‌ నిర్మాత వెయిన్‌స్టీన్‌ లైంగిక ఆగడాల కుంభకోణం వెలుగుచూసిన నేపథ్యంలో ఫ్రాన్స్‌లో ఒక కొత్త ఉద్యమం మొదలైంది. బాలన్సెటన్‌పోర్క్‌ యాష్‌ట్యాగ్‌ తో ట్విట్టర్‌ వేదికగా ఈ ఉద్యమం కొనసాగుతోంది.

'Want it or not, I will sleep with you': After Weinstein scandal, Frenchwomen expose 'pigs' who harassed them

ఈ యాష్‌ట్యాగ్‌ అర్థం 'మీ పంది బండారం బయటపెట్టండి'. మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులను వెలుగులోకి తీసుకురావాలని కోరుతూ ఫోయిస్‌లాగే జర్నలిస్టు అయిన సాండ్రా ముల్లర్‌ ఈ యాష్‌ట్యాగ్‌ క్రియేట్ చేశారు.

.అప్పటినుంచి వందలమంది మహిళలు తమకు ఎదురైన లైంగిక అకృత్యాలను వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఎంతోమంది తమకు ఎదురైన లైంగిక అకృత్యాలను వెలుగులోకి తీసుకురాకపోవడంపై విచారం వ్యక్తం చేస్తూ పోస్టులు చేశారు

మరోవైపు మైహార్వే వెయిన్‌స్టీన్‌ హ్యాష్‌ట్యాగ్‌తో ఇంగ్లిష్‌ నెటిజన్లు కూడా లైంగిక దుర్మార్గాలను వెలుగులోకి తీసుకువస్తున్నారు. ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు తమవంతుగా కృషి చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+