వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

VIDEO..గాలిలో ఎగిరే కారు, గంట‌కు 130 కి.మీ వేగంతో, దుబాయ్ లో ప్ర‌యోగం

|
Google Oneindia TeluguNews

ట్రాపిక్ పెరిగింది. మెట్రో సిటీల్లో అయితే మ‌రీను.. అందుకోసం కాస్త ముందుగా అయిన బ‌య‌ల్దేరాలి.. లేదంటే గాలిలో అయిన విహ‌రించాలి. అవును గాలిలో అంటే ఒకప్పుడు ప్లైట్ లేదంటే హెలికాప్ట‌ర్.. కానీ ఇప్పుడు గాలిలో ఎగిరే కార్లు, బైక్ కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ ప్ర‌యోగ ద‌శ‌లో ఉన్నాయి.. కానీ ధ‌ర మాత్రం భారీగానే ఉండ‌నున్నాయి. గాలిలో తేలిపోతుండ‌టంతో.. స్థాయి కలిగిన వారు కొనుగోలు చేసే అవ‌స‌రం ఉంటుంది.

గాలిలో ఎగిరే కారు..

గాలిలో ఎగిరే కారు..

క‌ర్బ‌న ఉద్గారాల‌ను త‌గ్గించ‌డానికి, రోడ్డుపై ట్రాఫిక్ నివారించ‌డానికి ప్లైయింగ్ కారు అవ‌స‌రం అవుతుంది. చైనాకు చెందిన ఓ సంస్థ దుబాయ్ లో ఎల‌క్ట్రిక్ ప్లైయింగ్ కారును విజ‌య‌వంతంగా ప్ర‌యోగించింది. జిపెంగ్ ఎక్స్ 2, గ్వాంజొ సంస్థ దీనిని డెవ‌ల‌ప్ చేసింది. ప్ర‌పంచంలో ఉన్న డ‌జ‌న్ ప్లైయింగ్ కార్ల‌లో ఇదీ ఒక‌టిగా నిలిచింది. ఆ కారును విజ‌య‌వంతంగా ప‌రీక్షించారు. అయితే అందుబాటులోకి రావ‌డానికి చాలా స‌మ‌యమే ప‌ట్టేలా ఉంది. ఇదే కాదు 2021 జూలైలో మాన‌వ స‌హిత విమాన ప‌రీక్ష కూడా నిర్వ‌హించారు.

ఇద్ద‌రు వెళ్లేందుకు ఛాన్స్

ఇద్ద‌రు వెళ్లేందుకు ఛాన్స్

కారులో మాత్రం ఇద్ద‌రు వెళ్ల‌డానికి వీలు ఉంది. 8 ప్రొపెల‌ర్ సెట్ ద్వారా కారు శక్తిని పొందుతుంది. కారు గంట‌కు 130 కిలోమీట‌ర్ల వేగంతో ప‌య‌నిస్తోంది. విమానం, హెలికాప్ట‌ర్ మాదిరిగా కాకుండా..ఇ విఐఒఎల్.. ఎల‌క్ట్రిక్ వాహ‌నాలు. క్విక్ పాయింట్ ప‌ర్స‌న‌ల్ ట్రావెల్ ఆధారంగా ల్యాండ్ అవుతాయ‌ని నిపుణులు తెలిపారు.

స‌వాళ్లు ఇవీ

ఈ కారు రోజంతా ఒక ప‌ట్ట‌ణంలో ప్ర‌యాణం చేయ‌గ‌లద‌ట‌. అయితే బ్యాట‌రీ లైఫ్, ఎయిర్ ట్రాఫిక్ నియంత్ర‌ణ‌, భ‌ద్ర‌త‌, మౌలిక స‌దుపాయ‌ల అంశం ఇప్ప‌టికీ స‌వాళ్ల‌ను ఎదుర్కొంటుంది. దీనిపై విదేశాంగ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సిందియా కూడా స్పందించారు. అమెరికా, కెన‌డాలో ట్ర‌య‌ల్స్ ముగిసిన త‌ర్వాత దేశంలో కూడా ఈ-వొటీఐఎల్ రూపంలో అర్బ‌న్ ఎయిర్ మొబిలిటీ ఆధారంగా ట్ర‌య‌ల్ చేస్తామ‌ని పేర్కొన్నారు. సో.. మ‌న దేశంలో కూడా గాలిలో ఎగిరే కారు ర‌య్ ర‌య్ అంటూ ఎగ‌ర‌నుంది.

English summary
Chinese firm tested out an electric flying taxi in Dubai. The XPeng X2, developed by the Guangzhou-based XPeng Inc's aviation affiliate, is one of dozens of flying car projects around the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X