షాక్: హైవేపై కుప్పకూలిన విమానం(వీడియో)
ఫ్లోరిడా: ఓ చిన్న విమానం వాహనాలతో రద్దీ ఉండే ఓ జాతీయ రహదారిపై ఒక్కసారిగా అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయింది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలోని పినెల్లాస్ కౌంటీలో జరిగింది. కాగా, ఈ ఘటనను పలువురు వీడియో తీశారు.
వివరాల్లోకి వెళితే.. రాక్‌వెల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు చెందిన ఒకే ఇంజిన్ కలిగిన ఓ చిన్న విమానం క్లియర్‌వాటర్ ఎయిర్‌పార్క్ నుంచి బయలుదేరింది. ఇందులో పైలట్ మార్క్ అలెన్‌తో పాటు గ్రెగరీ గినీ అనే ప్రయాణికుడు ఉన్నారు. .
అనంతరం అక్కడికి 80 కి.మీ దూరంలో ఉన్న జెఫిర్‌హిల్స్ మున్సిపల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయి ఇంధనాన్ని నింపుకొని.. తిరిగి వెనక్కి బయల్దేరింది.
క్లియర్‌వాటర్ ఎయిర్ పార్క్ ఇంకా రెండు కి.మీ దూరం ఉందనగా ఒక్కసారిగా విమానం ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే దగ్గర్లో ఉన్న ఓ హైవేపై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు పైలట్ యత్నించాడు.
అయితే, హైవేపై ల్యాండ్ అవుతుండగా విమానం రెక్కలు చెట్టు కొమ్మలకు ఢీకొన్నాయి. దీంతో విమానం పల్టీ కొట్టి కుప్పకూలింది. అదృష్టవశాత్తూ విమానంలో ఉన్న ఇద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అక్కడేవున్న ఓ పోలీసు వాహనంలో ఉన్న కెమెరాలో ఇదంతా రికార్డయింది. ఈ వీడియోను పినెల్లాస్ కౌంటీ పోలీసులు తమ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.












Click it and Unblock the Notifications