పుతిన్ పై మాకెప్పుడూ నమ్మకం లేదు: ఒబామా సంచలన వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రష్యా అధ్యక్షు వ్లాదిమిర్ పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ నమ్మదగిన వ్యక్తి కాదని, పుతిన్ చర్యలపై తమకెప్పుడూ నమ్మకం లేదని స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

రిపబ్లికన్ పార్టీ నేతలు రష్యా అధ్యక్షు వ్లాదిమిర్ పుతిన్ కు మద్దతుగా మాట్లాడడంపై ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల తరువాత పరిస్థితిపై మాట్లాడుతూ "అప్పుడు.. ఇప్పుడు మేం అదేవిధంగా ఉన్నాం. మాలో ఏ మార్పూ లేదు. ఇతర దేశాల నేతలపై ఆధారపడటం అమెరికాకు మంచిది కాదు.." అని ఆయన వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు చూస్తుంటే.. ఇటీవలి అమెరికా ఎన్నికలలో తమ పార్టీకి ప్రతికూల ఫలితాలు రావడం ఒబామాకు పుతిన్ పై ఆగ్రహాన్ని మరింత పెంచినట్లు కనిపిస్తోంది. పుతిన్ ఎప్పటికీ తమ బృంద సభ్యుడు కాదని ఆయన తేల్చేశారు.

We Never Believe Putin: Obams's Sensational Comments

అంతేకాదు, డొనాల్డ్ ట్రంప్ టీం తోటి అమెరికన్ మిత్రులమైన తమ డెమొక్రటిక్ పార్టీ నేతల కంటే విదేశీ వ్యక్తులను విశ్వసించడం దారుణమైన అంశంగా ఒబామా అభివర్ణించారు. ఇటీవలి అమెరికా ఎన్నికలలో హిల్లరీ క్లింటన్ కు వ్యతిరేకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రచారం చేయించారంటూ ఆయన మండిపడ్డారు.

మరోవైపు ఒబామా మాటలపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అమెరికా ఎన్నికల ఫలితాలపై హ్యాకింగ్ అంశాలప్రభావం లేదని, ఫలితాలు సరిగానే వచ్చాయని వ్యాఖ్యానించారు. తాను బాధ్యతలు స్వీకరించిన మూడు నెలల్లోగా సైబర్ సెక్యూరిటీ టీంను ఏర్పాటు చేస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+