ఒబామా పెద్ద కూతురి పేరు నటాషా!... నెటిజన్లు ఇలా...

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పెద్ద కూతురు సాశా తొలి పేరు నటాషా. అయితే ఈ విషయాన్ని ట్విట్టర్ లో ఆశ్లే సీ ఫోర్డ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ పెద్ద దుమారాన్నే రేపింది. నటాషా పేరును షేర్ చేస్తున్నారు.

ఒబామా పెద్ద కూతురు సాశా తన 16వ, పుట్టినరోజును ఘనంగా జరుపుకొన్నారు. అయితే ఈ వార్త సంచలనం కాదు కానీ, ఆమె తొలి పేరు నటాషా అని తెలిసి ఆశ్చర్యానికి గురైనట్టు ఆశ్లే సీ చేసిన ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు.

We've been living a lie!' Twitter has meltdown when it discovers that Sasha Obama's real name is Natasha

సాశా పేరు నటాషా అని తెలియని ఓ అబద్దాల ప్రపంచంలో మనం ఇంతకాలం బతుకుతున్నామని కొందరు స్పందించారు. అమెరికా అధ్యక్షుల వెనుక రష్యా కుట్ర ఉందనడానికి నటాషా పేరే సాక్ష్యమని కొందరు వ్యాఖ్యానించారు.

నటాషా అనే పేరును రష్యన్లు ఎక్కువమంది పెట్టుకొంటారని అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం వెనుక రష్యా కుట్ర ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఒబామా చిన్న కూతురు మాలియా అసలు పేరు చెల్సియానా అంటూ కొందరు ట్విట్టర్ లో ప్రశ్నించారు. మరికొందరు మారియా అసలు పేరు బోరిస్ అంటూ ఖాయం చేశారు.

సాశా పూర్తి పేరు సాశా అకా నటాషా ఒబామా . ఆమె పూర్తి పేరు ఎప్పుడూ ప్రస్తావనకు రాకపోవడంతో అందరికీ నటాషా అని తెలిసి ఉండకపోవచ్చు. కానీ మార్తాస్ వైన్ యార్డ్ దీవిలోని ఓ రెస్టారెంట్ లో గత వేసవిలో సాసా పనిచేసినప్పుడు ఆమె పూర్తిపేను మొదటిసారి చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Sasha Obama turned sixteen on Saturday, a day before Twitter was shocked to discover (again) that the former First Daughter's real first name isn't Sasha, but Natasha.
Please Wait while comments are loading...