వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాత్యహంకార హత్యే, ఖండిస్తున్నాం: శ్రీనివాస్ హత్యపై ట్రంప్ తొలిసారి, ఏమన్నారంటే..?

విద్వేష దాడులను ముక్త కంఠంతో ఖండించాలని, ఇలాంటి విద్వేష దాడులకు అమెరికాలో తావు లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆయన భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దే

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: విద్వేష దాడులను ముక్త కంఠంతో ఖండించాలని, ఇలాంటి విద్వేష దాడులకు అమెరికాలో తావు లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆయన భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి తొలిసారి ఆయన మాట్లాడారు.

donald trump

ఈ సందర్భంగా అమెరికా జాత్యాహంకారి కాల్పుల్లో మృతి చెందిన శ్రీనివాస్ కూచిభొట్ల మృతికి అమెరికా కాంగ్రెస్ నిమిషంపాటు మౌనం పాటించారు. శ్రీనివాస్‌ది జాత్యాహంకార దాడేనని వైట్ హౌజ్ అంగీకరించింది.

కాగా, మళ్లీ అమెరికాకు పునర్ వైభవం తీసుకురావాలని డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. బరాక్ ఒబామా పాలనలో దేశంలో ఉగ్రవాద దాడులు పెరిగిపోయాయని అన్నారు. ఉగ్రదాడుల్లో అమెరికాలోని అమాయకులు బలయ్యారని అన్నారు. అమెరికా పౌరులను రక్షించే బాధ్యత తనదేనని అన్నారు.

తాను నెల రోజుల్లో అద్భుతంగా పనిచేశానని చెప్పుకొచ్చారు. తమ హయాంలో దేశంలో అవినీతికి తావులేదని చెప్పారు. బొగ్గు కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చాక స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయని తెలిపారు. ఇమ్మిగ్రేట్ చట్టాల్లో మార్పులు తెచ్చానని తెలిపారు.

ఇమ్మిగ్రేషన్ నిబంధనలతో అమెరికా సురక్షితంగా ఉంటుందని చెప్పారు. లాబీయింగ్ పై ఐదేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఒబామా.. అమెరికాను వదిలేసి ఇతర దేశాల సరిహద్దులు కాపాడారని ఆరోపించారు. అమెరికా, మెక్సికో మధ్య గోడ కట్టితీరుతానని స్పష్టం చేశారు. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని చెప్పారు. అమెరికా వస్తువులనే కొనాలని, అమెరికా వారికే ఉద్యోగాలివ్వాలని కోరారు.

ముస్లిం వర్గాల మద్దతుతో ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేస్తామని తెలిపారు. నేరగాళ్ల ఆగడాలను అరికడతామని చెప్పారు. అమెరికా ప్రయోజనాలే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. అమెరికా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని స్పష్టం చేశారు. అమెరికా ముందుండి ప్రపంచాన్ని నడిపిస్తుందని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.

English summary
US President Donald Trump on Tuesday in his first speech to the Congress recalled the attack on the Jewish cemetery and the shooting incident in Kansas and said, "We are a country that stands united in condemning hate and evil in all of its very ugly forms." "Am here to deliver a message of unity and strength," he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X