తలచింది ఒకటి .. జరిగింది మరోటి .. వెబ్ పై సృష్టికర్త ఆందోళన
జెనీవా : www అంటే అందరికీ తెలుసు వరల్డ్ వైడ్ వెబ్. దేశాల మధ్య దూరం తగ్గించేందుకు రూపొందించారు. కానీ ప్రస్తుతం వెబ్ రెచ్చగొట్టే ప్రసంగాలు, ప్రకటనలతో నిండిపోయిందని వెబ్ సృష్టికర్త టిమ్ బెర్నెర్స్ లీ మాత్రం ఆందోళన వ్యక్తంచేశారు.

ఇలా అంకురార్పణ ..
ప్రభుత్వాలను, సంస్థలను లిస్టింగ్ చేయడానికి .. వాటితో ప్రజలను అనుసంధానం చేయడానికి సరిగ్గా 30 ఏళ్ల క్రితం వెబ్ ను ప్రారంభించారు. 1989 మార్చి 12 ప్రారంభమైన వెబ్ సేవలు .. ప్రపంచానికి గుప్పిట్లో ఉంచింది. ఆ సమయంలో యాపిల్ కంప్యూటర్ కొనుగోలు చేసి ... ఇతర కంప్యూటర్లతో అనుసంధానించేందేకు ర్యాండమ్ ప్రోగ్రామ్ రూపొందించారు. అందులో హైపర్ టెక్ట్స్ వినియోగించి .. డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు వెబ్ సైట్ ప్రారంభించి .. హెచ్ టీ పీపీని ప్రపంచంతో అనుసంధానం చేశామని గుర్తుచేశారు బెర్నెర్స్ లీ.

సంకల్పం ఇదీ ..
వెబ్ తో ప్రజల మధ్య దూరం తగ్గుతుందని భావించామని పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం రెచ్చగొట్టే ప్రసంగాలు, వీడియోలు, అసంబద్ధ రాతలకు వేదికవుతోంది. ఇది ప్రజల మధ్య దూరం పెంచుతోందని అభిప్రాయపడ్డారు. తాము అనుకొన్నది ఒక్కటైతే జరుగుతోంది మరోకటి అని యూరప్ అణు పరిశోధన సంస్థ (సెర్న్) ఏర్పాటుచేసిన వేడుకల్లో బెర్నెల్సీ ఆందోళన వ్యక్తం చేశారు.

నిఘా కోసం .. ఎన్నికల్లో లబ్ధికి ?
ఇవేకాదు ఇతరదేశాలుపై నిఘా పెట్టడానికి కూడా వెబ్ ను వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందొచ్చనే అభిప్రాయంతో ఉన్నారని మండిపడ్డారు. హ్యాకర్లు డేటాను కొల్లగొట్టేందుకు వినియోగించుకుంటుండగా .. ఇతరలను కించపరిచేందుకు వేదికగా మలుచుకుంటున్నారని వాపోయారు.

ఏం చేయాలి ?
ప్రస్తుత పరిస్థితి మారాలంటే వెబ్ సద్వినియోగంపై చర్చ జరగాలని బెర్నెర్స్ లీ అన్నారు. ఇందుకు పెద్ద కంపెనీలు కూడా ముందుకు రావాలని కోరారు. ఇందుకోసం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందిస్తే .. తాము అనుకున్న వెబ్ కల సాకారమవుతోందని అభిప్రాయపడ్డారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications