Iran vs Israel war: ఇక కాస్కోండి..ఆ రోజునే దాడులు:ఇజ్రాయిల్‌‌పై ఇరాన్ కన్నెర్ర..!

హమాస్ నేత ఇస్మాయిల్ హనియే హత్యతో ఇజ్రాయిల్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ సిద్ధమైనట్లు వెస్ట్రన్ ఇంటెలిజెన్స్ ద్వారా విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఇరాన్ ఇజ్రాయిల్ పై దాడులు చేసేందుకు తీసుకుంటున్న చర్యలకు సంబంధించి తమ వద్ద పక్కా ఆధారాలున్నట్లు పేర్కొంది.ఆగష్టు 12 నుంచి ఆగష్టు 13 మధ్య ఈ దాడులు చేసేందుకు ఇరాన్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

ఇక ఇజ్రాయిల్ పై దాడులు చేసేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళుతున్న ఇరాన్ ఇందుకు మరో ఉగ్రసంస్థ హిజ్బుల్లా సహకారం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ లెబనాన్ కేంద్రంగా ఇరాన్ సహాయంతో నడుస్తోంది.ఇక దాడులు చేసేందుకు ప్రత్యేక రోజులను ఎంచుకుంది.టిషా బి అవ్ పై దాడులు చేసేందుకు నిర్ణయించుకున్న ఇరాన్.. రెండు ప్రత్యేక రోజులను ఎంచుకున్నారు.

Western Intelligence Iran Plots Attack on Israel on Tisha BAv Day of Jewish Mourning

టిషా బి అవ్ రోజే టార్గెట్

టిషా బి అవ్‌ రోజున రెండు దేవాలయాల ధ్వంసం గురించి వాటిని గుర్తు చేసుకుంటూ విలపిస్తారు. ఏటా నిర్వహించే సంతాప కార్యక్రమంలో యూదులు ఉపవాసం ఉంటారు. అదే సమయంలో ఆ పాపానికి ప్రాయశ్చిత్తం కోరుతూ తమను క్షమించాల్సిందిగా ప్రార్థనలు చేస్తారు. ఏటా జరిగే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టిషా బి అవ్‌లో ప్రజలు గుమికూడుతారు. సరిగ్గా ఇదే రోజును ఇరాన్ టార్గెట్ చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఎక్స్‌లో ఇరాన్ సుప్రీం లీడర్ అలి ఖమేనీ కూడా ఇంతటి దారుణానికి పాల్పడిన ఇజ్రాయిల్ పై తప్పక పగ తీర్చుకుంటామంటూ బహిరంగ పోస్టు చేశారు.

అదే రోజు దాడులు ఎందుకు..?

ఇక ఆరోజునే టార్గెట్ చేసి దాడులు చేస్తే.. ఇజ్రాయిల్ యూదులకు పుండుపై కారం చల్లినట్లుగా ఉంటుందని అందుకే ఆ రోజును ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గతంలో కూడా యూదులు ఏదైతే సంతాపం పాటిస్తారో అదే రోజున పలు దాడులు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.1973 అక్టోబర్ 7వ తేదీన యూదులు సంతాపం తెలిపే రోజులనే టార్గెట్ చేసుకుని దాడులు జరిగాయి. యామ్ కిప్పుర్ యుద్దం కూడా అప్పుడే జరిగింది. యూదులకు కేవలం ఆ బాధను రెట్టింపు చేయాలన్న ఉద్దేశంతోనే ఆ తేదీలను ఎంచుకుని మరీ దాడులు నిర్వహించేందుకు ఇరాన్ ప్లాన్ చేస్తోంది.

ఇక ఈ దాడులతో అంతర్జాతీయ సమాజం అలర్ట్ అయి రాజకీయంగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు జోక్యం చేసుకుంటాయని ఇరాన్ భావిస్తున్నట్లు ఒక నివేదిక పేర్కొంది. మరోవైపు ఇజ్రాయిల్ పై ప్రత్యేకమైన రోజుల్లో దాడులు నిర్వహిస్తే అది ఉగ్రవాద సంస్థలకు ఊతమిచ్చినట్లవుతుందనే ఆందోళన కూడా ఉంది. ఉగ్రవాదులు కూడా అదే రోజును టార్గెట్ చేసుకుని భవిష్యత్తులో దాడులు చేయొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+