నో వాట్సప్.. బ్లాక్ చేసి పడేసిన రష్యా

అమెరికాకు చెందిన సోషల్ మీడియా దిగ్గజం మెటా, దాని యూజర్లకు రష్యా షాక్ ఇస్తోంది. దీని పరిధిలోని అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లను బ్లాక్ చేసే ప్రయత్నాలకు తెర తీసింది. ఇందులో భాగంగా మెటాకు చెందిన వాట్సప్ సర్వీసులను నిలిపివేసింది. ఈ విషయాన్ని వాట్సప్ స్వయంగా వెల్లడించింది. దీనిపై ఓ ట్వీట్ పోస్ట్ చేసింది. యూజర్లను ప్రభుత్వ నిఘా యాప్‌కు మళ్లించే ఉద్దేశంతో రష్యా వాట్సాప్‌ను పూర్తిగా నిరోధించడానికి ప్రయత్నించినట్లు వాట్సప్ తెలిపింది.

రష్యా.. తన సొంత సాంకేతికతో మ్యాక్స్ (MAX) అనే ఓ సోషల్ నెట్ వర్కింగ్ యాప్‌ను డెవలప్ చేసింది. పూర్తిగా అక్కడి ప్రభుత్వ నియంత్రణలో ఉండే ప్లాట్ ఫామ్ ఇది. తన దేశ సోషల్ మీడియా యూజర్లను దీని వైపు మళ్లించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని టాస్ మీడియా సంస్థ తెలిపింది. ఈ ప్రత్యామ్నాయ యాప్‌ను నిఘా కోసం ఉపయోగించవచ్చని వాట్సాప్ ఆరోపించగా.. రష్యా దీన్ని తోసిపుచ్చింది. ప్రభుత్వ ఆధీనంలోని నిఘా యాప్‌లకు ప్రజలను మళ్లించే ప్రయత్నాలలో భాగంగానే వాట్సాప్ ను బ్లాక్ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

WhatsApp Blocked in Russia While Putin Govt Bets on State-Backed MAX Amid Surveillance Concerns

తమ నెట్ వర్క్ బ్లాక్ అయినప్పటికీ- వంద మిలియన్లకు పైగా ఉన్న తమ వినియోగదారులను కనెక్ట్‌ చేయడానికి అన్ని విధాలుగా కృషి చేస్తుందని వాట్సప్ మేనేజ్మెంట్ వివరించింది. రష్యాలో ఈ మధ్యకాలంలో అంతర్జాతీయ స్థాయిలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్న దశలో వాట్సప్ బ్లాకింగ్ తెర మీదికి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సుదీర్ఘకాలంగా ఉక్రెయిన్‌తో సాగుతున్న యుద్ధం నేపథ్యంలో అనేక పాశ్చాత్య దేశాలు, అక్కడి టెక్ సంస్థల మధ్య ప్రతిష్టంభన నెలకొంది.

గ్లోబల్ టెక్ కంపెనీలన్నీ కూడా తమ దేశీయ చట్టాలను పాటించడంలో విఫలమయ్యాయని, సున్నిత సమాచారాన్ని బహిర్గతం చేస్తోన్నాయని, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా అవాస్తవాలనూ ప్రచారం చేస్తోన్నాయని రష్యా చాలాకాలం నుంచి ఆరోపిస్తూ వస్తోంది. తమ దేశంలో వాట్సాప్ సేవలు తిరిగి పునరుద్ధరణకు నోచుకోవాలంటే మెటా.. స్థానిక చట్టాలకు లోబడి ఉండాలని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ స్పష్టం చేశారు. మెటా రాజీ పడని వైఖరిని అవలంబిస్తే, వాట్సాప్ పునరుద్ధరణకు అవకాశం ఉండబోదని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+