సుచిర్ బాలాజీ అనుమానాస్పద మృతి: AI సీక్రెట్స్..?!

Suchi Balaji: అమెరికాకు చెందిన ప్రఖ్యాత ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ మాజీ రీసెర్చర్, విజిల్‌బ్లోయర్ సుచిర్ బాలాజీ అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయన వయస్సు 26 సంవత్సరాలు. అమెరికా శాన్‌ ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో నిర్జీవంగా కనిపించారు. ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

భారత సంతతికి చెందిన సుచిర్ బాలాజీ.. ఓపెన్ఏఐపై న్యాయపోరాటం చేస్తోన్నన నేపథ్యంలో ఆయన అనుమానాస్పదంగా మృతి చెందడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అపర కుబేరుడు ఎలాన్ మస్క్ స్థాపించిన సంస్థ ఓపెన్ఏఐ. 2020లో ఇంటర్న్‌షిప్ చేయడానికి ఇందులో చేరారు. అందులో రీసెర్చర్‌గా కొనసాగారు. ఈ ఏడాది అక్టోబర్‌లో తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

Whistleblower Suchir Balaji found dead at San Francisco apartment

కాపీ రైట్ విషయంలో మూడు నెలలుగా ఓపెన్ ఏఐపై న్యాయపోరాటం చేస్తూ వస్తోన్నాడు. చాట్ జీపీటీకి శిక్షణ ఇవ్వడానికి ఆయన డెవలప్‌మెంట్‌ చేసిన టెక్నాలజీకి సంబంధించిన కాపీరైట్ ఇది. తాను అభివృద్ధి చేసిన ఛాట్ జీపీటీ ఏఐ మోడల్‌‌ను ఓపెన్ ఏఐ వినియోగిస్తోందనేది ఆయన ప్రధాన ఆరోపణ. కాపీరైట్ చట్టాన్ని ఆ కంపెనీ ఉల్లంఘించిందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

మొట్ట మొదటిసారిగా నవంబర్‌ రెండో వారంలో బహిరంగంగా ఓపెన్ ఏఐపై ఆరోపణలు చేశారు సుచిర్ బాలాజీ. యూఎస్ మీడియాతో మాట్లాడారు. ఛాట్‌ జీపీటీకి శిక్షణ ఇవ్వడానికి వినియోగించిన టెక్నాలజీ ప్రతికూల ప్రభావం చూపుతోందని వ్యాఖ్యానించారు. తాను డెవలప్ చేసిన ప్రోగ్రామ్‌‌ను కాపీరైట్ కంటెంట్‌కు విరుద్ధంగా ఆ సంస్థ ఉపయోగించిందని ఆరోపించారు.

ఆ తరువాత కొద్ది రోజుల్లోనే అంటే నవంబర్ 26వ తేదీన శాన్‌ఫ్రాన్సిస్కో బుకానన్ స్ట్రీట్‌లో గల అపార్ట్‌మెంట్‌లో మృతదేహమై కనిపించారు. సుచిర్ బాలాజీ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు నిర్ధారించారు. అంతకుమించి- ఎలాంటి అనుమానాస్పద వస్తువులు సంఘటన స్థలంలో లభించలేదని తేల్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+