ఆ గొడవ సద్దుమణిగిందో లేదో గానీ.. గట్టిగా వాడుకుంటోన్న డొనాల్డ్ ట్రంప్
హెచ్ 1బీ విసా వార్షిక ఫీజుల పెంపుతో భారత్ ను షేక్ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరో వివాదానికి కేంద్రబిందువు అయ్యారు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తోన్న దేశాలన్నింటి ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. అలా చేయడం ఆయా దేశాలన్నీ కూడా కష్టాలను కొని తెచ్చుకున్నట్టవుతుందని వ్యాఖ్యానించారు. ఇదే అంశాన్ని- త్వరలో జరగబోయే ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రస్తావించనున్నారు.
ఇది- ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఐక్యరాజ్యసమితిలో ఆయన తొలి ప్రసంగం కానుంది. అమెరికా ఫస్ట్ అనే విధానాన్ని ప్రపంచ దేశాలకు బలంగా చాటిచెప్పడానికి ఓ వేదికగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాన్ని డొనాల్డ్ ట్రంప్ వినియోగించుకోనున్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలినా లీవిట్ వెల్లడించారు. సోమవారం ఆమె వైట్ హౌస్ లో విలేకరులతో మాట్లాడారు.

పాలస్తీనాను గుర్తించిన పశ్చిమ దేశాల నిర్ణయాన్ని ట్రంప్ నేరుగా తప్పుపట్టనున్నారని లీవిట్ స్పష్టం చేశారు. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం అంటే హమాస్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టే అవుతుందని ఆయన భావిస్తున్నారని చెప్పారు. ఆయా దేశాలు తీసుకుంటోన్న ఈ నిర్ణయాలు మాటల వరకే పరిమితం కావాలని కోరుకుంటోన్నట్లు వివరించారు. అమెరికా మిత్రదేశాలు కూడా ఈ జాబితాలో ఉండటం పట్ల ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తోన్నారని, దీని గురించి ఐరాసలో మాట్లాడతారని అన్నారు.
బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి దేశాలు.. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించడం పట్ల ట్రంప్.. ఆయా దేశాధినేతలతో త్వరలో మాట్లాడతారనీ తెలిపారు. తన బ్రిటన్ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని కీత్ స్మార్మర్ తో ఈ విషయాన్ని ప్రస్తావించారని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో రీజినల్ భాగస్వామ్య దేశాలను కూడా కలుపుకొని పోవాలని ట్రంప్ భావిస్తోన్నారు. ఖతార్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, టర్కీ, పాకిస్థాన్, ఈజిప్ట్, యూఏఈ, జోర్డాన్ దేశాధినేతలతో ఆయన సమావేశం నిర్వహిస్తారని లీవిట్ తెలిపారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications