వైట్ హౌస్ కొత్తేమీ కాదు: చరిత్రలో తొలిసారి: మోదీ కోసం- ఆప్యాయంగా ఆలింగనం

వాషింగ్టన్: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తలపెట్టిన అమెరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఆయన చేపట్టిన అమెరికా పర్యటన సత్ఫలితాలను అందిస్తోంది. ఆయన అమెరికాలో ఉండగానే.. భారత్‌పై పలు వరాలను కురిపించింది అగ్రరాజ్యం. భారత్‌లో కొత్తగా కాన్సులేట్లను ఏర్పాటు చేయబోతోన్నట్లు ప్రకటించింది. తొలిదశలో బెంగళూరు, అహ్మదాబాద్‌లల్లో వాటిని నెలకొల్పనుంది.

కొద్దిసేపటి కిందటే మోదీ వైట్ హౌస్‌లో జో బైడెన్- ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఏర్పాటు చేసిన స్టేట్ డిన్నర్‌కు హాజరయ్యారు. వైట్ హౌస్‌లో ఆయనకు కనీవినీ ఎరుగని రీతిలో ఘన స్వాగతం లభించింది. బైడెన్ దంపతులు మోదీని సాదరంగా ఆహ్వానించారు. మోదీ రాక కోసం వైట్ హౌస్ వద్ద ఎదురు చూస్తోన్న వందలాది మంది ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ- బైడెన్ క్లుప్తంగా ప్రసంగించారు.

White House have been opened for the Indian-American community, says PM Modi

ప్రవాస భారతీయుల కోసం వైట్ హౌస్ గేట్లు తెరచుకోవడం ఇదే తొలిసారి అని ప్రధాని మోదీ అన్నారు. ప్రధానిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత చాలాసార్లు తాను అమెరికాకు వచ్చానని, వైట్ హౌస్ తనకు కొత్తేమీ కాదని చెప్పారు. అమెరికాలో నివసించే భారతీయుల కోసం వైట్ హౌస్ తలుపులు తెరచుకోవడం ఇదే తొలిసారిగా పేర్కొన్నారు. ఈ ఉదంతం తన సంతోషాన్ని రెట్టింపు చేస్తోందని మోదీ వ్యాఖ్యానించారు.

భారత్- అమెరికా రెండూ ప్రజాస్వామ్య విలువలపై ఆధారపడి నడుస్తోన్నాయని మోదీ చెప్పారు. ఈ రెండు దేశాల రాజ్యాంగాలు వుయ్ ద పీపుల్ అనే మూడు పదాలతో ప్రారంభమౌతాయని గుర్తు చేశారు. రెండు దేశాల మధ్య సాంస్కృతిక వైవిధ్యం ఉందని పేర్కొన్నారు. ఇంట్రెస్ట్ ఫర్ ఆల్, వెల్‌ఫేర్ ఫర్ ఆల్ అనే ప్రాథమిక సూత్రాలను బలంగా విశ్వసిస్తోన్నాయని మోదీ అన్నారు.

యావత్ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ తరువాత దేశాలన్నీ కొత్త రూపాన్ని సంతరించుకుంటోన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో భారత్- అమెరికా మధ్య స్నేహం మరింత బలోపేతం అయ్యాయని పేర్కొన్నారు మోదీ. ప్రపంచ శాంతి, సుస్థిరత, సమాజ శ్రేయస్సు కోసం ఈ రెండు దేశాలు కలిసి పని చేయడానికి కట్టుబడి ఉన్నాయని తేల్చి చెప్పారు మోదీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+