Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

యుద్ధంపై బెట్టింగ్ కాసి కోట్లు సంపాదించారు: వైట్ హౌస్ ఇన్సైడర్ ట్రేడింగ్ మిస్టరీ

యుద్ధం అంటే సామాన్యులకు భయం.. కానీ కొందరు మేధావులకు మాత్రం అది కాసుల వర్షం కురిపించే వ్యాపారం. ఇరాన్‌తో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య, అమెరికా ప్రభుత్వ రహస్యాలను ఉపయోగించుకుని కొందరు అధికారులు స్టాక్ మార్కెట్‌లో భారీగా లాభాలు పొందారనే వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ మేనేజ్‌మెంట్ ఆఫీస్ తన సిబ్బందికి అత్యవసర మెయిల్స్ పంపింది.

మార్చి 2026 చివరి వారంలో ఒక వింత సంఘటన జరిగింది. ఇరాన్ చమురు కేంద్రాలపై దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడానికి సరిగ్గా ఒక్క నిమిషం ముందు.. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు ఆయిల్ మార్కెట్‌లో $500 మిలియన్ల నుండి $760 మిలియన్ల భారీ బెట్టింగ్ (Short position) చేశారు. ట్రంప్ ప్రకటన రాగానే చమురు ధరలు 15% పడిపోయాయి. దీంతో ఆ ట్రేడ్ చేసిన వారికి కేవలం కొన్ని గంటల్లోనే వందల కోట్ల లాభం వచ్చింది.

White House Insider Trading Scandal Staff Warned Over Oil Bets Amid Tensions With Iran and War Predictions

యుద్ధంపై జోస్యాలు.. లాభాల పంట!

కేవలం ఆయిల్ మార్కెట్ మాత్రమే కాకుండా, 'కాల్షి' (Kalshi), 'పాలిమార్కెట్' (Polymarket) వంటి ప్రెడిక్షన్ మార్కెట్లలో కూడా అసాధారణ కదలికలు కనిపించాయి. ఇరాన్‌తో కాల్పుల విరమణ ఎప్పుడు జరుగుతుందో సరిగ్గా ఊహించి కొందరు వ్యక్తులు భారీగా బెట్టింగ్ గెలిచారు. ఈ సమాచారం బయట ఉన్న సామాన్యులకు తెలిసే అవకాశం లేదు కాబట్టి, వైట్ హౌస్ లోపల ఉన్నవారే ఈ సమాచారాన్ని లీక్ చేశారనే అనుమానాలు బలపడుతున్నాయి.

ఇరాన్ వార్ వ్యతిరేకించిన అధికారికి ట్రంప్ షాక్..! వైట్ హౌస్ కీలక నిర్ణయం..!
ఇరాన్ వార్ వ్యతిరేకించిన అధికారికి ట్రంప్ షాక్..! వైట్ హౌస్ కీలక నిర్ణయం..!

వైట్ హౌస్ సీరియస్ వార్నింగ్

ఈ పరిణామాల నేపథ్యంలో వైట్ హౌస్ తన ఉద్యోగులను హెచ్చరించింది. "ప్రభుత్వ రహస్య సమాచారాన్ని వ్యక్తిగత లాభాల కోసం వాడటం నేరం. ఇలాంటి పనులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు" అని స్పష్టం చేసింది. అయితే, తమ సిబ్బందిపై వస్తున్న ఆరోపణలను వైట్ హౌస్ ప్రతినిధులు కొట్టిపారేస్తున్నారు. ఆధారాలు లేకుండా అధికారులపై బురద చల్లడం సరికాదని వారు వాదిస్తున్నారు.

వైట్ హౌస్ వద్ద కాల్పులు.. నిందితుడి గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి..
వైట్ హౌస్ వద్ద కాల్పులు.. నిందితుడి గురించి షాకింగ్ విషయాలు వెలుగులోకి..

జాతీయ భద్రతకు ముప్పు?

యుద్ధ ప్రణాళికలను మార్కెట్ బెట్టింగుల కోసం వాడుకోవడం అంటే.. అమెరికా ఏం చేయబోతుందో శత్రు దేశాలకు ముందే క్లూ ఇచ్చినట్లు అవుతుందని రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అమెరికా సెనేటర్లు రంగంలోకి దిగారు. యుద్ధం లేదా సైనిక చర్యల మీద ఎలాంటి బెట్టింగులు నిర్వహించకుండా కొత్త చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య తాత్కాలికంగా కాల్పుల విరమణ కొనసాగుతున్నప్పటికీ, మార్కెట్‌లో జరిగిన ఈ 'రహస్య వ్యాపారం' అమెరికా రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+