డొనాల్డ్ ట్రంప్ చేతికి అందిన నోబెల్- ఏం వాడకం రా బాబూ..?

అమెరికాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. వెనిజులాపై సైనిక చర్య, ఆ దేశాధ్యక్షుడు నికొలస్ మదురోను నిర్బంధించడం, కొత్త అధ్యక్షురాలి నియామకం అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి అవార్డు గ్రహీత మరియా కొరినా మచాడోతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైట్ హౌస్ లో ఈ భేటీ ఏర్పాటైంది. సుమారు గంట పాటు కొనసాగింది.

వెనిజులాపై సైనిక చర్య అనంతరం వారిద్దరు భేటీ కావడం ఇదే మొదటిసారి. పైగా స్వయానా పదవీచ్యుతుడైన ఆ దేశాధ్యక్షుడు, ప్రథమ మహిళ ఆమెరికాలో సైనికుల నిర్బంధంలో ఉన్న సమయంలో ఆమె స్వయంగా వైట్ హౌస్ కు రావడం, ట్రంప్ ను కలుసుకోవడం చర్చనీయాంశమైంది. వెనిజులాను విడిచిపెట్టిన సుదీర్ఘ కాలం తర్వాత.. వాషింగ్టన్‌లో మచాడో బహిరంగంగా కనిపించడం కూడా ఇదే తొలిసారి.

White House tweets Machado Presents Her Nobel Peace Prize to Trump in the Oval Office

ట్రంప్‌తో భేటీ అనంతరం వైట్‌హౌస్ నుంచి బయలుదేరిన మచాడో.. విలేకరులతో మాట్లాడారు. వెనిజులా స్వాతంత్ర్యం కోసం డొనాల్డ్ ట్రంప్‌పై ఆధారపడుతున్నామని పేర్కొన్నారు. తన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని ఆయనకు అందించినట్లు వెల్లడించారు. ట్రంప్ నిబద్ధతకు గుర్తింపుగా, తన నోబెల్ శాంతి పురస్కారాన్ని త్యాగం చేసినట్లు స్పష్టం చేశారు. వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ గురించి ట్రంప్ తో చర్చించినట్లు తెలిపారు.

నోబెల్ శాంతి బహుమతిని మచాడో.. ట్రంప్ కు అందజేసిన విషయాన్ని వైట్ హౌస్ నిర్ధారించింది. దీనికి సంబంధించిన ఫొటోను విడుదల చేసింది. దీన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాను సాధించిన నోబెల్ శాంతి బహుమతిని డొనాల్డ్ ట్రంప్ చేతికి అందించిన ఫొటో ఇది. నోబెల్ పీస్ ప్రైజ్, మచాడోతో కలిసి డొనాల్డ్ ట్రంప్ ఫొటో దిగారు. ప్రస్తుతం ఈ పతకం ట్రంప్ స్వాధీనంలో ఉందని వైట్ హౌస్ తెలిపింది.

ఈ సమావేశం వివరాలను ట్రంప్ క్లుప్తంగా వెల్లడించారు. మచాడోను కలుసుకోవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఎన్నో కష్టాలను అనుభవించిన అద్భుతమైన మహిళగా ప్రశంసించారు. కాగా- నోబెల్ కమిటీ నిబంధనల ప్రకారం.. శాంతి బహుమతిని ఇతరులకు బదిలీ చేయడానికి లేదా వారితో పంచుకోవడానికి అవకాశం లేదు. నార్వేజియన్ నోబెల్ ఇన్‌స్టిట్యూట్ ఈ విషయాన్ని పునరుద్ఘాటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+