ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..!

ఇరాన్ (Iran)పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్దం ప్రారంభించి ఇవాళ్టికి సరిగ్గా నెల రోజులు. ఫిబ్రవరి 28న మొదలుపెట్టిన ఈ వార్ ను ఎలా ముగించాలో తెలియక సతమతం అవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) ఇప్పుడు చర్చల పేరుతో దాడుల్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. కానీ ఆ చర్చలు ఎప్పుడు మొదలవుతాయో ఎవరికీ తెలియని పరిస్దితి. మరోవైపు ఇరాన్ బహిరంగంగానే చర్చల్ని తోసిపుచ్చుతోంది. ఈ నేపథ్యంలో చర్చల్ని ఆపుతున్న మూడు ప్రధాన కారణాల్ని ఓసారి చూద్దాం..

ఇరాన్ వార్ తో తగులుగుతున్న ఎదురుదెబ్బలు, ముగింపు తెలియకుండా చేస్తున్న యుద్దం మధ్య ట్రంప్.. రెండు రోజులుగా చర్చలు జరుగుతున్నందున విద్యుత్ కేంద్రాలపై దాడుల్ని ఐదు రోజుల పాటు వాయిదా వేసినట్లు ప్రకటించారు. అనంతరం దాన్ని మరో 10 రోజులు పొడిగించారు. అయితే ఈ మధ్యలో ఏమైనా చర్చలు జరిగాయా అంటే సమాధానం లేదు. దీని వెనుక ఉన్న మూడు ప్రధాన కారణాలు అమెరికా జరిగే చర్చల ప్రయత్నాలపై అపనమ్మకం, పరోక్ష సంభాషణ, నేరుగా పాల్గొనడానికి ఇరాన్ విముఖత. ఈ మూడు కారణాలతో చర్చలు ఏ దశలోనూ ప్రారంభం కావట్లేదు.

Why Iran Rejects Trump s Calls Unpacking 3 Barriers to Peace

సైనిక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, యుద్దం ముగించడానికి దౌత్యపరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు చెప్పిన అమెరికా.. ఇదే క్రమంలో ఇరాన్ కు 15 షరతుల్ని పెట్టింది. అయితే ఇరాన్ దీన్ని ఏకపక్షంగా ఉందంటూ తోసిపుచ్చింది. మరోవైపు యుద్ధం ప్రారంభమయ్యాక అమెరికా-ఇరాన్ మధ్య ఉన్నత స్థాయిలో ప్రత్యక్ష చర్చలు తిరిగి ప్రారంభం కాలేదు కాబట్టి ట్రంప్.. పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్, ఒమన్ వంటి తృతీయ పక్ష మధ్యవర్తులపై ఆధారపడ్డారు. కానీ దాడుల మధ్య చర్చలకు ఇరాన్ అంగీకరించట్లేదు. అలాగే తమ కీలక నేతల ఫోన్లను ట్రాక్ చేసి అమెరికా-ఇజ్రాయెల్ హత్యలు చేయడంతో ఇప్పుడు మధ్యవర్తులతోనూ ఫోన్లలో మాట్లాడేందుకు ఇరాన్ నేతలు మొగ్గు చూపట్లేదు. ఇంకా చెప్పాలంటే అసలు ఫోన్లే వాడట్లేదు.

Why Iran Rejects Trump s Calls Unpacking 3 Barriers to Peace

దీంతో పరోక్ష మార్గాలు, పరస్పర అపనమ్మకం, ఇరాన్ ప్రముఖులలోని భద్రతాపరమైన ఆందోళనల వల్ల.. ఇరుపక్షాలు మెసేజ్ లు పంపాలనుకున్నా లేదా ఒక ఒప్పందంపై ఆసక్తిని అంచనా వేయాలనుకున్నా, మధ్యవర్తులకు సమాధానాలు రావడానికి , వారి వైఖరులను స్పష్టం చేయడానికి చాలా ఎక్కువ సమయం పడుతోంది. తాము దౌత్యానికి సిద్ధంగా ఉన్నామని బహిరంగంగా చెబుతున్నప్పటికీ, అమెరికా దౌత్యవేత్తలు, మిత్రదేశాలు ప్రత్యక్ష చర్చలు లేదా కాల్పుల విరమణ దిశగా అర్థవంతమైన పురోగతిని ఎందుకు ప్రకటించలేకపోయాయో దీన్ని బట్టి అర్థమవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+