ప్రియురాలికి మెసేజ్: భర్త పురుషాంగాన్ని రెండుసార్లు కోసేసిన భార్య
షాంఘై: తన భర్త మరో అమ్మాయితో ప్రేమాయణం సాగిస్తున్నాడని తెలుసుకున్న ఓ భార్య ఆయన పురుషాంగాన్ని కోసేసింది. దానిని ఆమె రెండుసార్లు కోసేసింది. చైనా సెంట్రల్ ఫ్రావిన్స్‌కు చెందిన ఫ్యాన్ లూంగ్ అనే 32 ఏళ్ల యువకుడికి పెళ్లై ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారు.
ఈ మధ్య కొంతకాలంగా అతను మరో యువతి ప్రేమలో పడ్డాడు. ఫోన్‌లు, చాటింగులు చేస్తున్నాడు. ఇవేమీ భార్యకు తెలియనీయకుండా జాగ్రత్త పడ్డాడు. ఆయన విషయం భార్యకు తెలియక పోవడంతో అతను మరింత రెచ్చిపోయాడు. భార్య ఫోన్ నుంచే ప్రియురాలికి రొమాంటిక్ మెసేజ్‌లు పంపించటం ప్రారంభించాడు.
ఈ క్రమంలో మంగళవారం తన విరహ తాపాన్ని వర్ణిస్తూ ఓ మెయిల్‌ను భార్య ఫోన్ నుంచే పంపాడు. అయితే నిండా మునిగిన ప్రేమ మైకంలో మెయిల్ బాక్స్‌ను లాగవుట్ చేయటం మరచిపోయాడు. ఆ తర్వాత మొబైల్‌లో ఆ సందేశాలు చూసిన భార్యకు ఆగ్రహం ముంచుకొచ్చింది.

ఆవేశంలో పక్క గదిలో నిద్రపోతున్న మొగుడి పురుషాంగాన్ని పదునైన కత్తితో కోసేసింది. అతను తన భార్యను పక్కకు తోసేసి, ఆసుపత్రికి వెళ్లాడు. అతి కష్టమ్మీద సర్జరీ చేసి పురుషాంగాన్ని తిరిగి వైద్యులు అతికించారు. అయితే, కోపం తగ్గని ఆ భార్య ఆసుపత్రికి కూడా వచ్చింది.
నేరుగా భర్త ఉన్న గదిలోకి తోసుకెళ్లి అప్పుడే అతికించిన అంగాన్ని ఇష్టం వచ్చినట్లు కోసి కిటికీలోంచి బయటకు విసిరేసింది. సంగతి తెలుసుకున్న ఆస్పత్రి సిబ్బంది వచ్చి చూసేటప్పటికే ఏ కాకో, పిల్లో ఆ ముక్కల్ని నోటకరుచుకుపోయాయి. వైద్యులు మరో సర్జరీ చేసిన బాధితుడి ప్రాణాలు నిలబెట్టగలిగారు. అతను తన సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోవడం పెద్ద విషయం కాదని, అతనికి ఐదుగురు పిల్లలు ఉన్నారని ఆ భార్య ఆగ్రహంతో చెబుతున్నారు.












Click it and Unblock the Notifications