పిల్లలు పుట్టలేదని వెళ్తే అన్నా చెల్లెళ్ళని తేలింది
డెన్వర్ :కొండకు నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందనేది నానుడి. ఈ నానుడి సరిగ్గా అమెరికా దేశంలోని ఓ జంటకు వర్తిస్తోంది. పిల్లలు పుట్టలేదని ఆసుపత్రికి వెళ్ళిన దంపతులు అక్కడ వచ్చిన రిపోర్టులతో షాక్ కు గురయ్యారు. ఆసుపత్రికి వెళ్ళే ముందు భార్య భర్తలుగా ఉన్నవారు. ఆసుపత్రిలో పరీక్సల తర్వాత అన్నా చెల్లెలుగా మారారు. వింత గొలిపే ఈ ఘటన అమెరికా దేశంలోని డెన్వర్ లో చోటుచేసుకొంది.
అమెరికా దేశంలోని కొలరాడో రాష్ట్రంలోని డెన్వర్ నరంలో ఓ జంట తమకు పిల్లలు పుట్టలేదని చాలా ఆసుపత్రుల చుట్టూ తిరిగారు.అయినా ఫలితం లేకపోయింది. కృత్రిమ గర్బదారణ పద్దతుల ద్వారా సంతానాన్ని పొందాలని భావించారు.ఈ మేరకు కృత్రిమ గర్భదారణ కోసం ఆసుపత్రికి వెళ్ళిన ఆ దంపతుల వరుసలే మారిపోయాయి. ఈ పరీక్షల్లో వచ్చిన ఫలితాలు చూసిన డాక్టర్లు దిమ్మ తిరిగిపోయారు.
కృత్రిమ గర్భదారణ కోసం ఆసుపత్రి వైద్యులు ఇద్దరి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ పరీక్షల్లో వచ్చిన ఫలితాలు వైద్యులను షాక్ కు గురిచేశాయి. ఇద్దరికి ఒకే రకమైన డిఎన్ ఏ లుగా వైద్యులు గుర్తించారు.ఇద్దరు బందువులా, లేదా దగ్గరి కుటుంబసభ్యులా అని వైద్యులు ప్రశ్నించారు. అయితే ఇద్దరం ఒకే పుట్టినట్టు ఆ దంపతులు చెప్పారు.కాని తల్లిదండ్రులు వేర్వేరు అని, వేర్వేరు ప్రాంతాలకు చెందినవారమని ఆ దంపతులు తేల్చి చెప్పారు.

అసలు దూరం బందువులు కాకుండా, కుటుంబ సభ్యులు కాకుండా ఇద్దరికీ ఒకే రకమైన డిఎనప్ఏ ఎలా ఉంటుందని డాక్టర్లు వారిని ప్రశ్నించారు.దీంతో తమ పుట్టుపూర్వోత్తరాలపై వారు ఆరా తీస్తే సంచనాత్మకమైన వాస్తవాలు బయటపడ్డాయి.ఇధ్దరూ కూడ కవల పిల్లలని తేలింది. అంతే కాదు ఇద్దరూ కూడ అన్నా చెల్లెలుగా తేలిపోయింది.వీరి తల్లిదండ్రులు వీరి చిన్నతనంలోనే రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.అయితే ఈ పిల్లలు అనాథశ్రమంలో చేర్పించారు స్థానికులు.
వీరిద్దరిని వేర్వేరు దంపతులు దత్తత తీసుకొన్నారు.దత్తత సమయంలో వారి రికార్డులను దత్తత తీసుకొన్నవారికి అనాథ శరణాలయం వారు ఇవ్వలేదు.వీరు కవలలనే విషయాన్ని దత్తత తీసుకొన్న తల్లిదండ్రులకు అనాథశరణాయలం నిర్వహాకులు చెప్పలేదు. డాక్టర్ల పరీక్షల తర్వాత అనాథశరణాలయంలో విచారిస్తే అసలు విషయాలు వెలుగుచూశాయి.ఇప్పుడు ఇన్నాళ్ళకు కలుసుకొన్నామని సంతోషపడాలో.....అన్నా చెల్లెళ్ళ సంబందం అని తెలియక పెళ్ళిచేసుకొన్నామని బాదపడాలో అర్థం కాని గందరగోళ పరిస్థితిలో ఉన్నారు వారు.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications