మరో ‘షేక్’హ్యాండ్: ట్రంప్‌కు షాకిచ్చిన పోలాండ్ తొలి మహిళ(వీడియో)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మరోసారి ‘షేక్ హ్యాండ్’ వార్తల్లోకి తెచ్చింది. తాజాగా పోలాండ్‌లోనూ ట్రంప్‌కి అలాంటి అనుభవమే ఎదురైంది.
వార్సా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను మరోసారి 'షేక్ హ్యాండ్' వార్తల్లోకి తెచ్చింది. ఇటీవల ట్రంప్ చేస్తున్న విదేశీ పర్యటనల కంటే.. ఆ సమయంలో ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులే హాట్ టాపిక్‌గా మారుతున్నాయి.
ఆ మధ్య ఇజ్రాయెల్, రోమ్ పర్యటనలకు వెళ్లినప్పుడు భార్య మిలానియా చేతిని అందుకోడానికి ఆయన ప్రయత్నించగా, ఆమె ట్రంప్ చేతిని విదిలించుకున్న సందర్భాలు మీడియాకు చిక్కాయి. అప్పుడు అది మీడియాలో సంచలనంగా మారింది.
తాజాగా, ఇలాంటి ఘటనే మరోటి చోటు చేసుకుంది. పోలాండ్ వెళ్ళిన ట్రంప్ దంపతులకు పోలాండ్ అధ్యక్షుడు ఆంద్రెజ్ దుడా ఘన స్వాగతం పలికారు. తొలుత ఆంద్రెజ్‌కు ట్రంప్ షేక్‌హ్యాండ్ ఇచ్చారు. ఆ తర్వాత పక్కనే ఉన్న పోలాండ్ అధ్యక్షుడి సతీమణి అగాటా కోర్న్‌హౌషర్‌కు షేక్ హ్యాండ్ ఇస్తుండగా.. ఆమె మాత్రం ట్రంప్‌ను దాటుకుంటూ వెళ్లి మెలానియాకు షేక్‌హ్యాండ్ ఇచ్చి ముచ్చటించారు.
అయితే, ఆ తర్వాత కాసేపటికి వెనక్కు తిరిగి ట్రంప్‌తో కూడా కరచాలనం చేశారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారి హల్‌చల్ చేస్తోంది. ట్రంప్‌ను దాటుకుంటూ పోలాండ్ ప్రథమ మహిళ వెళ్తున్నప్పుడు ఆయన ముఖ కవళికలను చూసి.. అమెరికా అధ్యక్షుడికి మళ్లీ కోపం వచ్చింది అంటూ పలువరు నెటిజన్లు సెటైర్లు వేశారు.
-
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!!












Click it and Unblock the Notifications