వాషింగ్ మెషీన్ పై రివ్యూ.. టాప్ లెస్ ఫోటో పోస్ట్ చేసిన మహిళ..

స్టీవేంజ్ : అత్యుత్సాహం కొన్నిసార్లు ఊహించని తప్పిదాలకు దారి తీస్తుంది. పట్టరాని సంతోషంతో ఆ క్షణంలో ఏం చేస్తున్నామో అర్ధం కాదు. ఉత్సాహం కాస్త తగ్గాక.. తీరిగ్గా విషయాన్ని పరిశీలిస్తే అప్పుడు గానీ అసలు తప్పిదమేంటో బోధపడదు. తాజాగా ఓ మహిళ కూడా ఇదే తరహాలో వ్యవహరించి నవ్వులపాలయింది.

స్టీవెంజ్ కు చెందిన లూసీ అనే మహిళ 400 డాలర్లు ఖర్చు చేసి కొత్తగా ఎల్ జీ వాషింగ్ మెషీన్ ను కొనుగోలు చేసింది. వాషింగ్ మెషీన్ కొన్నానన్న ఆనందం.. మెషీన్ కూడా బాగా వర్క్ చేస్తుండడంతో.. దానిపై ఓ రివ్యూ రాసేసి, దానికి వాషింగ్ మెషీన్ ఫోటో జత చేసి కర్రీస్ పీసీ వరల్డ్ అనే సైట్ లో అప్ లోడ్ చేసింది. 'కొత్త మెషీన్ నాకు చాలా నచ్చింది. చాలా బాగా వర్క్ చేస్తోంది.. పెద్ద తలుపు.. ఆగిపోయే సమయంలో మంచి సౌండ్ కూడా వస్తోంది' అంటూ రివ్యూ రాసేసింది.

Woman accidentally posts topless selfie in rave online review of her new washing machine

ఇందులో ఆమె చేసిన తప్పిదమేంటి అనుకుంటున్నారా?.. వాషింగ్ మెషీన్ ఫోటో క్లిక్ మనిపిస్తున్నప్పుడు లూసీ టాప్ లెస్ గా ఉంది. కెమెరా ఫ్లాష్ కూడా ఆన్ చేసి ఉండడంతో.. వాషింగ్ మెషీన్ అద్దంలో టాప్ లెస్ గా ఉన్న తన ఫోటో కూడా రిఫ్లెక్ట్ అయింది. అయితే ఇవేవీ పట్టించుకోని లూసీ ఆ ఫోటోను ఆన్ లైన్ లో పోస్ట్ చేసింది. ఆ సమయంలో ఆమె ఒంటిపై పింక్ కలర్ ప్యాంటీ తప్ప నూలుపోగు లేదు.

దీంతో ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఆమె పోస్ట్ చేసిన ఫోటో వైరల్ గా మారింది. ఎలక్ట్రానిక్ వస్తువుల రివ్యూలు చదవడానికి ఏమాత్రం ఆసక్తి చూపించని వారు కూడా ఇప్పుడామె ఫోటోను చూడడానికి మాత్రం లూసీ రివ్యూ గురించి ఆరా తీస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+