వాహనంపై నగ్నంగా మహిళ: ట్రాఫిక్ జాం(వీడియో)
హూస్టన్: అమెరికాలోని హూస్టన్ ప్రాంతంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ 18 టైర్ల వాహనంపైకి ఎక్కి నగ్నంగా నిలబడింది. కాసేపు చిందులు వేసిన తర్వాత దానిపైనే కూర్చింది. దీంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.
సమాచారం అందుకున్న అత్యవసర సేవల విభాగం అధికారులు అక్కడి చేరుకున్నారు. ఆమెను వాహనం నుంచి కిందికి దిగాలను కోరారు. గత సోమవారం రహదారి సమీపంలో ఓ ప్రమాదం చోటు చేసుకుంది.

ఆమెకూ ఆ ప్రమాదానికి ఏమైనా సంబంధం ఉందా? అనేదానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ మహిళ నగ్నంగా వాహనంపై రెండు గంటపాటు ఉండటంతో వాహనాలు దారిమళ్లించాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఆమెపై చర్యలు తీసుకున్నారా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications