సూర్యుడిపై ప్లాట్లు: ఈబేపై మహిళ వ్యాజ్యం దాఖలు
లండన్: తాను సూర్యుడిపై ప్లాట్లు అమ్మేందుకు నిషేధం విధించిడంపై ఓ 54ఏళ్ల స్పానిష్ మహిళ ఇ కామర్స్ దిగ్గజం ఈబేపై లా సూట్ దాఖలు చేసింది. 2010 నుంచి సూర్యుడిపై తనకు హక్కులున్నాయని, సోలార్ పవర్‌ను వాడుకునే వారందరూ తనకు బిల్లు చెల్లించాలని గాలిసియాలోని స్పానిష్ ప్రాంతం విగోకు చెందిన మారియా డూరన్ డిమాండ్ చేశారు.
అంతేగాక, స్పెయిన్‌లో సదరు మహిళ తన పేరున ఆ నక్షత్రాన్ని నోటరీ ఆఫీసులో రిజిస్టర్ చేయించుకుంది. ఈబే ఖాతా తెరవకముందే స్వ్కేర్ మీటరు ప్లాటుకు ఒక యూరోగా నిర్ణయించింది. కానీ, రెండేళ్ల తర్వాత సూర్యుడి మీద ప్లాట్లు అమ్మడం అనేది సాధ్యంకాని పని అని, తమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నందునే ఆ మహిళ ఖాతాను బ్లాక్ చేస్తున్నామని ఈబే ప్రకటించింది.
దీంతో ఈబేపై తాను కోర్టులో వ్యాజ్యం దాఖలు చేస్తానని ఆమె ఈబే సంస్థను బెదిరింపులకు గురి చేసింది. అంతేగాక, స్పానీష్ కోర్టులో ఆమె వ్యాజ్యం దాఖలు చేసింది కూడా. కాగా, ఈ వ్యాజ్యంపై వచ్చే నెల విచారణ జరగనుంది.

తనకు 7,500 పౌండ్లు చెల్లించాల్సి ఉందని, ఇప్పటి వరకు ముట్టలేదని తెలిపింది. కోర్టుకు వెళ్లికుండా కేసును పరిష్కరించాలనుకున్నా.. కుదరలేదని చెప్పింది. కాగా, తన సొంత వెబ్‌సైట్‌లో సూర్యుడిపై ప్లాట్లను అమ్మడం మొదలు పెట్టింది ఈ మహిళ.
అంతర్జాతీయంగా ఓ ఒప్పందం ఉందని.. ఏ దేశం కూడా గ్రహాలను గానీ, నక్షత్రాలను సొంతం చేసుకోలేదని చెప్పింది. అయితే తాను వ్యక్తిని కావడంతో తనకు ఆ నిబంధన వర్తించదని పేర్కొంది.












Click it and Unblock the Notifications