సెక్స్ సమ్మె: రోడ్ల కోసం భర్తలతో సెక్స్‌కు నిరాకరణ

Women
లండన్: ఇంతవరకు ఎన్నో ఉద్యమాలను చూశాం కానీ తమ ప్రయోజనాల కోసం ఓ వినూత్నమైన, వింత ఉద్యమాన్ని ఇంగ్లండ్‌లోని మహిళలు నిర్వహిస్తున్నారు. తమ ప్రాంతంలోని రోడ్లను బాగు చేయాలనే డిమాండ్‌తో ఇంగ్లండ్ దేశంలోని కొలంబియా, బార్బకావోస్ వెనకబడిన ప్రాంతాల్లోని మహిళలు శృంగార నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు.

అస్తవ్యస్థంగా ఉన్న తమ ప్రాంతంలోని రోడ్లకు మరమ్మతు చేయాలని వారు డిమాండ్ చేశారు. అప్పటి వరకు తమ భాగస్వాములతో శృంగారానికి దూరంగా ఉంటామని వారు ప్రతిజ్ఞ చేశారు. రోడ్లు బాగోలేని కారణంగా బార్బకావోస్ నుంచి సమీప ప్రాంతంలోని ఆస్పత్రికి వెళ్లాలంటే సుమారు 14గంటలు పడుతోందని వారు వాపోయారు.

రోడ్లు అస్తవ్యస్థంగా ఉన్న కారణంగా మార్గమధ్యంలోనే చాలా మంది అనారోగ్యంతో మరణించారని వారు పేర్కొంటున్నారు. తమ సమస్యలపై అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు తెలిపారు.

గత రెండేళ్లలో ఇంగ్లండ్ దేశంలో ఇలాంటి ఉద్యమాలు రావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన ఇంగ్లండ్ దేశం ప్రస్తుతం ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటోందని మహిళల ఉద్యమం ద్వారా వెలుగుచూసింది. మహిళల ఉద్యమంతో స్పందించిన స్థానిక అధికారులు రోడ్ల మరమ్మతులు చేయడం ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+