హెచ్1-బితో లాభపడింది ఎవరు?: అమెరికా-ఇండియాపై మిచిగాన్ వర్సిటీ రిపోర్ట్..
వీసా ప్రోగ్రామ్ వల్ల 2010లో అమెరికా ఉద్యోగుల సంపద 431మిలియన్లకు పెరిగినట్లు తెలిపారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టడమే ఆలస్యం విదేశీ వలసలకు చెక్ పెడుతూ స్థానికులకే అన్ని రంగాల్లో పెద్ద పీట వేసేలా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా హెచ్1బి వీసా నిబంధనలను కఠినతరం చేయడం.. ప్రీమియం వీసాలను రద్దు చేయడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ నిర్ణయం భారతీయ ఐటీ మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపింది. వేతన నిబంధనలను సైతం సవరించడంతో.. అత్యుత్తమ ప్రతిభ కలిగిన దేశీ ఉద్యోగులను మాత్రమే ఐటీ కంపెనీలు అమెరికాలో నియమించుకుంటున్నాయి. ఈ పరిస్థితి అక్కడివారికి కలిసొచ్చింది. విదేశీ వలసలు తగ్గడంతో.. అమెరికన్లకే కంపెనీలు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది.

వీసా ప్రోగ్రామ్‌తో రెండు దేశాలకు లాభమే:
ఇన్నాళ్లు తమ ఉద్యోగాలను భారతీయులు కొల్లగొట్టారని వాపోయిన అమెరికన్లు ట్రంప్ నిర్ణయాలతో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు దక్కించుకున్నారు. ఉద్యోగాల సంగతెలా ఉన్నప్పటికీ.. వీసా ప్రోగ్రామ్ వల్ల ఇరు దేశాలు లబ్ది పొందుతున్నాయని 'ది యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్' సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్ మెంట్ రీసెర్చర్లు తమ తాజా అధ్యయనంలో వెల్లడించారు.

భారత్, అమెరికాల్లో పెరిగిన ఉత్పాదకత:
అమెరికా వీసా ప్రోగ్రామ్ వల్ల ఇరు దేశాల ఆదాయాలు 17.3బిలియన్ డాలర్లు పెరిగాయని, అంతేగాక అమెరికా, భారత్ ల ఐటీ ఉత్పత్తి 2010లో 0.45శాతం పెరిగిందని సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్ మెంట్ గౌరవ్ ఖన్నా, మిచిగాన్ యూనివర్సిటీ నికొలస్ మోరాలెస్ పేర్కొన్నారు. అమెరికా కలను సాధించే క్రమంలో ఐటీ బూమ్, ఇతర పర్యవసనాలు పేరుతో ఈ పుస్తకాన్ని వెలువరించారు.

ఇమ్మిగ్రేషన్ తోనే ఉన్నతంగా:
వీసా ప్రోగ్రామ్ వల్ల 2010లో అమెరికా ఉద్యోగుల సంపద 431మిలియన్లకు పెరిగినట్లు తెలిపారు. ఇమ్మిగ్రేషన్ తోనే ప్రతీ దేశంలోని సగటు ఉద్యోగి కూడా ఉన్నతంగా తీర్చిదిద్దబడుతున్నాడని అధ్యయనంలో పేర్కొనడం గమనార్హం. వీసా ప్రోగ్రామ్ వల్ల సహజంగానే అమెరికా లోకల్ ఎంప్లాయిస్ ఎక్కువగా లబ్ది పొందుతున్నారని ఖన్నా తెలిపారు.

లోతైన విశ్లేషణ:
తాజా అధ్యయనంలో హెచ్-1బి వీసా ప్రోగ్రామ్ పై లోతుగా విశ్లేషణలు జరిపారు. 2000కాలం నుంచి అమెరికా, భారత ఆర్థిక వ్యవస్థలపై అది ప్రభావం చూపిన తీరును విశ్లేషించారు.కాగా, దేశీయ టెక్ దిగ్గజాలు టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు హెచ్-1బి వీసా ప్రోగ్రామ్ ద్వారా అమెరికాలో విదేశీయులకు ఉద్యోగాలు కల్పిస్తున్నాయి. అమెరికా వీసా నిబంధనలతో విదేశీయుల స్థానంలో స్థానికులకే ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు దక్కుతున్నాయి.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications