16వ అంతస్తులో ఒళ్లుజలధరించే స్టంట్: యువతి పోల్ డ్యాన్స్, ఎలా.. ఎక్కడ చేశారంటే?
మాస్కో: రష్యాలో ఓ యువతి ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసింది. 16 అంతస్తుల భవనం పైన పోల్ డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోల్ డ్యాన్స్ ప్రదర్శన మాస్కోలో చేసింది. దీనిని డ్రోన్ ద్వారా, గోప్రో కెమెరాల ద్వారా చిత్రీకరించారు.
ఒళ్లు జలదరించేలా పోల్ డ్యాన్స్
27 ఏళ్ల పోల్ డ్యాన్సర్ మరినా కోర్జెనెవ్‌స్కాయా అనే యువతి రష్యాలోని వోరోనెజ్‌లోని 16 అంతస్తుల బిల్డింగ్ పైకి ఎక్కింది. అక్కడ పోల్ డ్యాన్స్ చేసింది. ఒళ్లు జలదరించే ఈ ప్రదర్శనను గత ఏడాది ఆగస్ట్ నెలలో చేసింది. కానీ ఈ వీడియోను ఇప్పుడు విడుదల చేశారు.

గతంలోను స్టంట్స్
ఈమె గతంలోనూ భయానక స్టంట్స్ చేసింది. గత ఏడాది ఏప్రిల్ నెలలో మంచుతో స్టంట్స్ చేసింది. అలాగే మాస్కోలోని జర్యాడ్యే పార్క్‌లో గత ఏడాది అక్టోబర్‌లో బ్రిడ్జి పైన స్టంట్స్ నిర్వహించింది. ఇప్పుడు పోల్ డ్యాన్స్ చేసింది.

ఐరన్ రాడ్డుతో రక్షణ వలయం
ఈమె 16వ అంతస్తు పైన పోల్ డ్యాన్స్ చేసినప్పటికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. 16వ అంతస్తు పైన ఆమె పోల్ డ్యాన్స్ చేసే ప్రాంతానికి కింది భాగన ఐరన్ రాడ్డులతో రక్షణ వలయం ఏర్పాటు చేశారు. ఆమె సునాయాసంగా పోల్ డ్యాన్స్ చేసింది. కానీ అనుకోని ప్రమాదం జరిగితే పడిపోకుండా ఉండేందుకు దీనిని ఏర్పాటు చేశారు. కానీ అత్యంత ఎత్తు నుంచి పోల్ డ్యాన్స్ చేయడం సాధారణ విషయం కాదు. అక్కడి నుంచి కిందకు చూస్తేనే కళ్లు తిరుగుతాయి.
-
సమ్మర్ స్పెషల్ 'బాదంపాలు'.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి..! -
ఆ గోర్లేంటీ.. ఆ చెయ్యేంటీ: అల్లు అర్జున్- అట్లీ బాక్సాఫీస్ కింగ్ కాంగ్: ఈ దెబ్బకు -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
తమిళనాడులో రిచ్ అభ్యర్థి ఈమెనే! ఎవరీ లీమా రోజ్ మార్టిన్? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..! -
ఇరాన్ డెడ్ లైన్ పై ట్రంప్ మళ్లీ వెనక్కి ? అదే టర్నింగ్ పాయింట్..! -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
వేసవి సెలవులలో పిల్లలు ఆ పనిచేసే అవకాశం.. తల్లిదండ్రులు అలెర్ట్! -
Tamil Nadu Poll Survey: తమిళనాడులో షాకింగ్ ఫలితాలు-లోక్ పోల్ తుది సర్వేలో వారే క్లీన్ స్వీప్..! -
చందమామకు అవతలి వైపు అద్భుతం- సంపూర్ణ సూర్యగ్రహణం












Click it and Unblock the Notifications