మానవుడి అద్భుత సృష్టి.. పాతాళంలో హోటల్.. లోపల ఏముందంటే..?

సాధారణంగా హోటల్స్ అంటే రోడ్డు పక్కన ఉంటాయి. కొండలపై, సముద్రం పక్కన కూడా హోటల్స్ ఉంటాయి. కానీ పాతాళంలో హోటల్ ఎప్పుడైనా చూశారా..? అది కూడా 1300 అడుగుల లోతులో ఉంది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత లోతులో ఉన్న హోటల్ గా రికార్డు నెలకొల్పింది. మీకు సాహస యాత్రలు ఇష్టం ఉంటే.. ఈ హోటల్ ను కచ్చితంగా విజిట్ చేయాలని అంటున్నారు అక్కడి సాహస యాత్రికులు. ఈ అరుదైన హోటల్ గురించి మీరు కూడా తెలుసుకోండి.

మనం సాధారణంగా ఎలాంటి హోటల్ కు వెళ్తాం..? పచ్చని చెట్లు, ప్రకృతి మధ్య ఆహ్లాదకరంగా, విశాలంగా ఉన్న హోటల్ కు వెళ్తాం కానీ.. కానీ సాహసాలు చేసే వారికి ఇలాంటి హోటల్స్ నచ్చుతాయా చెప్పండి. ఏదో కొత్తగా ఉండాలని ఆలోచించారు అలాంటి సాహసాలు చేసే వ్యక్తి కారా బుచానన్. అనుకున్నదే తడవుగా భూమి లోపల పాతాళంలో ఉన్న హోటల్ కు వెళ్లి అక్కడ ఓ రోజు గడపాలని నిర్ణయించుకున్నారు. ఈ హోటల్ నార్త్ వేల్స్ లో ఉంది. భూమికి 1300 అడుగుల లోతులో ఈ హోటల్ ఉండటం విశేషం. అతికష్టం మీద ఈ హోటల్ న సందర్శించిన కారా.. ఈ యాత్రను వీడియో తీసి ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్ అవుతోంది.

World s Deepest Hotel 1300 Feet Below Ground in North Wales Trends Online

హోటల్ విశేషాలివే..

ఈ హోటల్ ను 1800 ప్రాంతంలో ఏర్పడిన ఓ గనిలో నిర్మించారట. ఇది భూమికి 1300 అడుగుల లోతులో ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత లోతైన హోటల్ ఇదే. తాడు సాయంతో ఈ హోటల్ కు వెళ్లాలట. ఆ హోటల్ లో లివింగ్ రూమ్ కూడా ఉంది. కారా ఈ రూమ్ లోనే ఓ రాత్రి మొత్తం స్టే చేశారు. తన జీవితంలో ఆ రాత్రి బెస్ట్ స్లీప్ అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ రూమ్ ను ఓ టన్నెల్ లో రూపొందించారట. వరల్డ్ డీపెస్ట్ హోటల్ లో నిద్రించాలని మీకు ఉందా అని కారా తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సాహస యాత్రికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకూ ఈ వీడియోనూ కోటి మంది వరకూ చూశారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ హోటల్ చూసేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+