ప్రపంచ అత్యంత ధనికుల జాబితాలో మళ్లీ ఆయనే ఫస్ట్.. సెకండ్ ప్లేసులో ట్విస్ట్ !
ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాను బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ మరోసారి ప్రకటించింది. ప్రపంచంలోని ధనవంతుల పోరులో ఎలాన్ మస్క్ విజయదుందుభి మోగించారు. టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ మరోసారి తన నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. 331 బిలియన్ డాలర్ల నికర సంపదతో మస్క్ ప్రస్తుతం ప్రపంచంలోని అత్యంత ధనవంతుడిగా తన అగ్రస్థానాన్ని కాపాడుకున్నారు. మస్క్ 331 బిలియన్ డాలర్ల నికర సంపదతో టాప్ లో ఉన్నారు.
ఇక ఏప్రిల్ 23న ఆయన సంపద 7.5 బిలియన్ డాలర్ల మేర పెరగడం, టెస్లా షేర్లు ఒక్కరోజులోనే 5 శాతం మేర పెరగడం ఇందుకు కారణమయ్యాయి. మస్క్ ఇటీవల ప్రభుత్వ విధుల్లో కేటాయించే సమయాన్ని తగ్గించి టెస్లా కార్యకలాపాలపై మరింత దృష్టి కేంద్రీకరించనున్నట్లు ప్రకటించడంతో కంపెనీ స్టాక్‌కు మద్దతు లభించింది. అలానే ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌ను అధిగమించి ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్న వ్యక్తిగా అవతరించారు.

మార్క్ జుకర్‌బర్గ్ నికర సంపద 212 బిలియన్ డాలర్లకు చేరగా.. జెఫ్ బెజోస్ సంపద 209 బిలియన్ డాలర్లకు పడిపోయింది. మే 5 నాటి ట్రేడింగ్‌లో జుకర్‌బర్గ్ సంపద 846 మిలియన్ డాలర్లు పెరిగితే, అదే సమయంలో బెజోస్ 2.90 బిలియన్ డాలర్లు నష్టపోయారు. ఈ ఏడాది ఇప్పటివరకు జుకర్‌బర్గ్ సంపద 4.63 బిలియన్ డాలర్లు పెరిగింది.
మెటా మే 1న వెల్లడించిన మొదటి త్రైమాసికంలో 42.31 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నివేదించింది. ఇది విశ్లేషకుల అంచనా అయిన 41.39 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. ఇక రెండో త్రైమాసికానికి గాను 42.5 బిలియన్ డాలర్ల నుంచి 45.5 బిలియన్ డాలర్ల మధ్య ఆదాయాన్ని అంచనా వేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అదే కాలంలో అమెజాన్ షేర్లు కేవలం 6.33 శాతం మాత్రమే వృద్ధి చెందడం జుకర్ బర్గ్ ఆదాయం పెరుగుదలకు దోహదపడింది.












Click it and Unblock the Notifications