పాన్ వరల్డ్ హీరో ఆఫ్ ది ఇయర్ అవార్డు ఆయనకు కాక మరెవరికి?

Year Ender 2025 Donald Trump: డొనాల్డ్ జాన్ ట్రంప్.. 2024 సంవత్సరంలో పాన్ వరల్డ్ హీరో అయ్యారు. అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో పుటల్లో తన పేరును లిఖించుకోగలిగారు. ఈ సంవత్సరం చిరస్మరణీయంగా మిగిలిపోతుందాయనకు. అగ్రరాజ్యం అమెరికా రాజకీయ చరిత్రలో గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు.

కోర్టు కేసులూ..

అధ్యక్ష ఎన్నికల్లో ఒకసారి ఓడిపోయి, కోర్టు కేసులనూ ఎదుర్కొంటూ, అత్యంత ప్రతికూల వాతావరణంలో కూడా రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించగలగడం అసాధారణ విషయం. పైగా- రికార్డు స్థాయి మెజారిటీతో గెలవడం అంటే మాటలు కాదు. అమెరికా 47వ అధ్యక్షుడిగా జనవరి 20వ తేదీన అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. ఆయనతో పాటు ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేస్తారు.

Year Ender 2024 Donald Trump returns to power with massive mandate

సునామీ..

ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన జరిగిన ఎన్నికల్లో 312 ఎలక్టోరల్ ఓట్లతో సునామీ సృష్టించారు డొనాల్డ్ ట్రంప్. 49.9 శాతం ఓట్లతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆయనకు పోల్ అయిన మొత్తం ఓర్ల సంఖ్య ఏడు కోట్లను దాటింది. 7,72,68,289గా లెక్క తేలింది. ఈ ఎన్నికలను ట్రంప్ ఏకపక్షంగా మార్చివేశారు తన ఛరిష్మాతో.

పోటీ ఇవ్వలేని కమల హ్యారిస్..

డొనాల్డ్ ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు పడ్డ ఓట్ల శాతం 48.4. మొత్తంగా 7,49,82,822 ఓట్లకే ఆమె పరిమితం కావాల్సి వచ్చింది. 2019 నాటి ఎన్నికల్లో డెమోక్రాట్లకు పట్టం కట్టిన కొన్ని కీలక రాష్ట్రాలు ఈ దఫా స్వింగ్ అయ్యాయి. రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపాయి.

పని పోయిందనుకున్న వాళ్లే..

2019 నాటి ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తరువాత డొనాల్డ్ ట్రంప్ పని అయిపోయిందనే అనుకున్నారంతా. సొంత రిపబ్లికన్ పార్టీలోనే ఆయనకు పోటీ ఎదురైంది. అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ నుంచి నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి వంటి నాయకులు పోటీ పడ్డారు. ఆ తరువాత వాళ్లందరూ తప్పుకోవడంతో ట్రంప్ రేసులో నిలిచారు.

బలమైన జోడీతో ఢీ..

ప్రస్తుతం అధికారంలో ఉన్న అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ జోడీని విజయవంతంగా ఎదుర్కొనగలిగారు. ఈ క్రమంలో తుపాకీ గుళ్లను కూడా రుచి చూడాల్సొచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో ప్రసంగిస్తోన్న సమయంలో ఆయనపై కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆయన కుడిచెవిని రాసుకుంటూ వెళ్లింది బుల్లెట్. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడగలిగారాయన.

రెండుసార్లు ఫైరింగ్..

ఆ తరువాత కూడా ఆయనపై కాల్పులు జరిగాయి. ఫ్లోరిడా వెస్ట్ పామ్ బీచ్ ఇంటర్నేషనల్ గోల్ఫ్ క్లబ్‌లో గోల్ఫ్ ఆడుతున్న సమయంలో ఆయనను లక్ష్యంగా చేసుకుని షూటర్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి అపాయం సంభవించలేదు. రాజకీయంగా, భౌతికంగా ఇన్ని ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని అగ్రరాజ్యాధినేతగా ఎదిగారు డొనాల్డ్ ట్రంప్.

టైమ్ అవార్డ్..

ఈ స్థాయిలో ఘన విజయాన్ని సాధించిన డొనాల్డ్ ట్రంప్‌ను పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2024గా ఎంపిక చేసింది ప్రతిష్ఠాత్మక టైమ్ మేగజైన్. ఈ అరుదైన గుర్తింపును పొందడం ఆయనకు ఇది రెండోసారి. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు అప్పుడు కూడా పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+