వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్షిపణి దాడులతో ఉలిక్కిపడ్డ సౌదీ అరేబియా

|
Google Oneindia TeluguNews

ప్రశాంతంగా ఉన్న సౌదీ అరేబియా దేశం క్షిపణులు ఒక్కసారిగా దూసుకురావడంతో గడగడలాడింది. తిరుగుబాటు దారుల అధీనంలో ఉన్న యెమెన్‌లోని ఓ ప్రాంతం నుంచి ఈ క్షిపణులు దూసుకొచ్చినట్లు తెలుస్తోంది. అయితే సౌదీ బలగాలు వాటిని గాలిలోనే కట్టడి చేసినట్లు సమాచారం. దీంతో రియాద్ నగరమంతా పేలుళ్ల శబ్దంతో దద్దరిల్లింది.

యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటు దారులు ఈ క్షిపణులను ప్రయోగించినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. అయితే ఈ క్షిపణుల దాడిలో ప్రాణనష్టం ఏమైనా జరిగిందా అన్న ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఇదిలా ఉంటే అక్కడే ఉన్న జర్నలిస్టు తాను కనీసం నాలుగు భారీ పేలుడు శబ్దాలను విన్నట్లు వెల్లడించారు.

Yemen Missiles intercepted over Saudis Riyadh

ఇదిలా ఉంటే హౌతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ మద్దతిస్తోంది. రియాద్‌ను టార్గెట్ చేస్తూ వదిలిన మిస్సైళ్లు లక్ష్యాన్ని చేరుకోకముందే వాటిని గాలిలోనే పేల్చేసినట్లు రియాద్ మిలటరీ ప్రతినిధి తుర్కి అల్ మాలిక్ వివరించారు. ఇక మిసైళ్లు తమ నగరంవైపు దూసుకొస్తుండటం గమనించిన కొందరు వాటిని తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

English summary
Saudi air defenses intercepted two missiles over Riyadh Sunday that had been fired from rebel-held territory in neighboring Yemen, state media said, after multiple explosions were heard in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X