ఉక్రెయిన్ నూతన ప్రధానిగా యూలియా స్విరిడెంకో.. జెలెన్‌స్కీ ప్రకటన
Yulia Svyrydenko: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య ఉక్రెయిన్‌లో కీలక రాజకీయ మార్పు జరగబోతోంది. అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ సోమవారం యూలియా స్విరిడెంకోను దేశ తదుపరి ప్రధానమంత్రిగా నామినేట్ చేశారు. పార్లమెంట్ ఆమోదిస్తే యూలియా టిమోషింకో తర్వాత ఉక్రెయిన్ రెండో మహిళా ప్రధానమంత్రి అవుతారు. ఆమె నియామకం కేవలం ఒక లాంఛనప్రాయంగా భావించబడుతోంది. ఎందుకంటే పార్లమెంట్‌లో జెలెన్‌స్కీకి మెజారిటీ ఉంది. యూలియా స్విరిడెంకో ప్రస్తుతం ఉక్రెయిన్ ప్రభుత్వంలో మొదటి డిప్యూటీ ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిగా పని చేస్తున్నారు. యుద్ధ సమయంలో ఆమె అమెరికా, ఐరోపాతో ఆర్థిక సహకారాన్ని మాత్రమే కాకుండా.. రక్షణ పరిశ్రమ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించారు.
యూలియా స్విరిడెంకో.. గొప్ప ఆర్థిక వేత్త
యూలియా శిక్షణ పొందిన ఆర్థిక వేత్త.. ఆమె అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వంతో ఖనిజ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించారు. ప్రారంభంలో అమెరికా ఉక్రెయిన్‌ను ఆర్థికంగా నియంత్రించే షరతులను విధించినప్పటికీ.. యూలియా తెలివితేటల వల్ల ఉక్రెయిన్ కు అనుకూలమైన షరతులు లభించాయి. మాజీ ఆర్థిక మంత్రి టిమోఫీ మైలోవానోవ్ ప్రకారం.. ఆమె ఈ చర్చకు ఏకైక, ప్రధాన నాయకురాలు. ఆమె లేకుంటే బహుశా ఒప్పందం రద్దయ్యేదన్నారు. దీనితో పాటు యూరోపియన్ దేశాలతో ఉక్రెయిన్ పునర్నిర్మాణం, యుద్ధం తర్వాత ఆర్థిక ప్రణాళికలో కూడా యూలియా నిర్ణయాత్మక పాత్ర పోషించారు. ఆమె అంతర్జాతీయ సహకారం, రక్షణ ఉత్పత్తి, పెట్టుబడుల రంగాలలో గొప్ప కృషి చేశారు.

అధికారి నుంచి ప్రధాని వరకు ప్రయాణం
యూలియా స్విరిడెంకో డిసెంబర్ 25, 1985న ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్‌లో జన్మించారు. ఆమె 2008లో కీవ్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఎకనామిక్స్ నుండి పట్టభద్రురాలయ్యారు. అదే సంవత్సరం ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆర్థికవేత్తగా పనిచేయడం ప్రారంభించారు. 2011లో ఆమెను చైనాలోని వూక్సీ నగరంలో చెర్నిహివ్ వాణిజ్య మిషన్ అధిపతిగా నియమించారు. అక్కడ ఆమె విదేశీ పెట్టుబడులను తీసుకువచ్చే బాధ్యతను స్వీకరించారు. పూర్తిగా విదేశీ పెట్టుబడులతో స్థాపించబడిన ఎకో-వోటార్ అనే సంస్థ స్థాపనలో పాత్ర పోషించారు. 2015లో ఆమె ప్రభుత్వ సేవలోకి అడుగుపెట్టారు. ఆమె మొదట స్థానిక ప్రభుత్వ సలహాదారుగా, తర్వాత చెర్నిహివ్ ప్రాంత ఆర్థిక అభివృద్ధి విభాగం అధిపతిగా నియమితులయ్యారు. 2017లో ఆమెను డిప్యూటీ గవర్నర్‌గా చేశారు.ఆమె నాయకత్వ సామర్థ్యం వల్ల ఆమె ప్రాంతంలో దాదాపు 340 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఆర్థిక అభివృద్ధి పరంగా ఇది ఉక్రెయిన్ లో మొదటిస్థానంలో నిలిచింది.
జాతీయ స్థాయిలో వేగంగా ఎదిగిన యూలియా
2019లో అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆమెను ఆర్థిక వ్యవహారాల ఉపమంత్రిగా నియమించారు. 2020లో ఆమెను ఆర్థిక అభివృద్ధి, వాణిజ్యం, వ్యవసాయ శాఖకు మొదటి ఉపమంత్రిగా చేశారు. అదే సంవత్సరం ఆమెను అధ్యక్ష కార్యాలయానికి ఉప అధిపతిగా కూడా నియమించారు. 2021లో రష్యా దాడికి కొన్ని నెలల ముందు ఆమెకు ఉక్రెయిన్ మొదటి ఉప ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రి బాధ్యతలు అప్పగించబడ్డాయి.
ఈ నియామకం ఎందుకు కీలకం?
రష్యాతో సుదీర్ఘ యుద్ధం మధ్య.. ఉక్రెయిన్ ఇప్పుడు ఆర్థిక రంగంలో కూడా తనను తాను బలోపేతం చేసుకోవాలని కోరుకుంటోంది. యూలియా స్విరిడెంకో నియామకం ఈ దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా భావించబడుతోంది. ఆమె ఒక సంక్లిష్ట సమయంలో ప్రధానమంత్రి అవుతున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ సైనిక, ఆర్థిక, దౌత్య స్థాయిలో తన బలాన్ని నిరూపించుకోవాలి. యూలియా పరిపాలనా అనుభవం, అంతర్జాతీయ సంబంధాలలో పట్టు, యుద్ధకాలంలో నాయకత్వ నైపుణ్యాలు ఉక్రెయిన్ రాజకీయాలలో ఆమెను మరో స్థాయికి చేర్చగలవు.
I held a meeting with First Deputy Prime Minister Yuliia Svyrydenko. A report was delivered on the implementation of agreements with European and American partners regarding support for Ukraine reached during the recent Ukraine Recovery Conference. We must swiftly implement… pic.twitter.com/AIipRnpA1f
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) July 14, 2025
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications