ఉక్రెయిన్ కు మహిళా ప్రధాని- చక్రం తిప్పిన ట్రంప్?

Russia Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య సంవత్సరాల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధానికి అంతం అనేది ఉండట్లేదు. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి.

ఈ యుద్ధంలో వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. భారీ స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.

Yuliia Svyrydenko was appointed as the new PM of Ukraine

రష్యా సైన్యానికి అంత తేలిగ్గా తలవంచట్లేదు ఉక్రెయిన్. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది. రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను సైతం విడిపించుకోగలిగింది.

ఈ పరిస్థితుల మధ్య ఉక్రెయిన్ కు కొత్త ప్రధానమంత్రి నియమితులయ్యారు. యులియా స్విరిడెంకోను బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఆమె ఉక్రెయిన్ ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. 2022లో రష్యాతో యుద్ధం ఆరంభమైన తరువాత చోటు చేసుకున్న కీలక మార్పు ఇదే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

యూలియా స్విరిడెంకోకు అమెరికాతో సత్సంబంధాలు ఉన్నాయి. ఉక్రెయిన్ తరఫున అమెరికాతో ఖనిజ ఒప్పందాల కోసం నిర్వహించిన చర్చలకు ప్రతినిధిగా ఉన్న యులియా స్విరిడెంకోను ఉక్రెయిన్ కొత్త ప్రధానమంత్రిగా నియమించారు. రష్యా 2022లో పూర్తిస్థాయిలో దండయాత్ర ప్రారంభించిన తర్వాత ఈ పదవిని చేపట్టిన తొలి వ్యక్తి ఆమె.

ప్రస్తుత యుద్ధ పరిస్థితుల మధ్య దేశీయంగా ఆయుధాల ఉత్పత్తిని పెంచడం, సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడిపించడంపై ఆమె దృష్టి సారించనున్నారు. మంత్రివర్గంలో భారీ మార్పులకు అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ తెర తీసిన నేపథ్యంలో- యూలియా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత ప్రధాని డెనిష్ ష్మిహాల్ స్థానంలో ఆమె నియమితులు అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+