Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్రంప్‌తో భేటీకి జెలెన్‌స్కీ భయం.. వాషింగ్టన్‌లో యూరప్ మద్దతుతో ప్రత్యక్షం!

Trump-Zelensky Meeting: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలెన్‌స్కీల మధ్య జరగనున్న సమావేశంపై ప్రపంచం దృష్టి సారించింది. ఈ కీలక భేటీకి ఉక్రెయిన్ అధ్యక్షుడిని ఒంటరిగా పంపేందుకు ఐరోపా నేతలు భయపడుతున్నారు. ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడిని కలిసేందుకు వెళ్లిన జెలెన్‌స్కీకి వైట్ హౌస్‪లో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా చేయొద్దంటూ జెలెన్‌స్కీపై ట్రంప్ ఆ భేటీలో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో భేటీలో జెలెన్‌స్కీ ఒంటరిగా కాకుండా యూరప్‌లోని ఏడుగురు ముఖ్య నాయకులతో కలిసి వాషింగ్టన్‌కు వెళ్తున్నారు. ఈ భేటీ కేవలం ఉక్రెయిన్ కు మాత్రమే కాకుండా మొత్తం ఐరోపాకు కూడా అత్యంత ముఖ్యమైన సమావేశంగా మారింది.

జెలెన్‌స్కీతో కలిసి యూరోపియన్ నాయకులు
రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చలపై జెలెన్‌స్కీతో ట్రంప్ ఒంటరిగా భేటీ అయితే.. పుతిన్ డిమాండ్ చేసిన డోన్‌బాస్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించేలా ఆయన ఒత్తిడి చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అందుకే గత మూడేళ్లుగా ఉక్రెయిన్‌కు మద్దతు ఇస్తున్నయూరోపియన్ నాయకులు ఈ సమావేశంలో జెలెన్‌స్కీ పక్షాన బలంగా నిలబడటానికి వాషింగ్టన్‌కు బయలుదేరారు. అంతే కాకుండా.. తదుపరి ట్రంప్-పుతిన్-జెలెన్‌స్కీల మధ్య జరగనున్న త్రైపాక్షిక చర్చల్లో యూరప్ కూడా భాగం కావాలని ఈ నాయకులు కోరుకుంటున్నారు.

Zelensky Fears Solo Trump Meeting European Leaders Join in Washington

ఈ సమావేశంలో జెలెన్‌స్కీతో పాటు పాల్గొనే యూరోపియన్ నాయకుల జాబితా

*యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్

*నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే

*ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మాక్రాన్

*జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడెరిక్ మెర్జ్

*బ్రిటిష్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్

*ఫిన్లాండ్ ప్రధానమంత్రి అలెగ్జాండర్ స్టబ్

*ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ

వీరందరూ సమావేశానికి ముందు జెలెన్‌స్కీతో ఒక వర్చువల్ సమావేశంలో కూడా పాల్గొన్నారు.

ట్రంప్-జెలెన్‌స్కీల భేటీ అజెండా

ఈ సమావేశం ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెడుతుంది:

1.త్రైపాక్షిక చర్చల ప్రణాళిక: ఆగస్టు 22న జరగనున్న ట్రంప్-జెలెన్‌స్కీ-పుతిన్ త్రైపాక్షిక చర్చలకు ఒక రూపు ఇవ్వడం.

2.ఉక్రెయిన్ భద్రతకు హామీ: రష్యాతో శాంతి చర్చల్లో ఉక్రెయిన్ భద్రతకు సంబంధించిన హామీలపై చర్చ.

3.యూరప్ భాగస్వామ్యం: ఈ త్రైపాక్షిక చర్చల్లో నాల్గవ పక్షంగా యూరప్‌ను కూడా చేర్చడానికి ప్రయత్నించడం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+