ఆ దేశానికి కృతజ్ఞత లేదు.. యుద్ధం ఆపినా.. ట్రంప్ సంచలనం..

ఉక్రెయిన్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ కు అమెరికా సపోర్ట్ చేసినా.. ఆ దేశం మాత్రం అమెరికాపై జీరో గ్రాటిట్యూడ్ చూపించిందని మండిపడ్డారు. అలాగే యూరోపియన్ దేశాలు.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన అధికారిక సామాజిక మాధ్యమం అయిన ట్రూత్ సోషల్ లో ఈ పోస్టు పెట్టారు. జెనీవాలో ఉక్రెయిన్- అమెరికా మధ్య చర్చలు నడుస్తున్న సమయంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్, యూరోప్ దేశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్.. అమెరికాపై జీరో గ్రాటిట్యూడ్ ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. నవంబర్ 23న జెనీవాలో జరిగిన చర్చల్లో భాగంగా డొనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో సమావేశం నిర్వహించారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నిలిపివేసేందుకు ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ మేరకు ఉక్రెయిన్ కు నవంబర్ 27 డెడ్ లైన్ పెట్టారు ట్రంప్. ఈ లోపు శాంతి ప్రణాళికకు అంగీకరించాలని అన్నారు. అయితే ఉక్రెయిన్ మాత్రం శాంతి ప్రణాళికకు కొన్ని సవరణలు చేయాలని చెబుతోంది.

ఈ క్రమంలో యూరోప్ దేశాలపైనా అమెరికా అధ్యక్షుడు ఫైర్ అయ్యారు. ఓవైపు ఉక్రెయిన్ పై రష్యా బలగాలు దాడులు చేస్తుంటే యూరోప్ దేశాలు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. అలాగే ఉక్రెయిన్ తమపై జీరో గ్రాటిట్యూడ్ చూపించిందని పేర్కొన్నారు. అసలు రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం వచ్చేదే కాదని అభిప్రాయపడ్డారు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ట్రంప్ మరోసారి కీలక ఆరోపణలు చేశారు. ఆ ఎన్నికలను దోచుకున్నారని మండిపడ్డారు. తామే అధికారంలో ఉంటే ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం వచ్చేదే కాదని స్పష్టం చేశారు. నా మొదటి టర్మ్ లో ఈ యుద్ధం ప్రస్తావన ఎక్కడా రాలేదని తెలిపారు.

Zero Gratitude Blast Trump Slams Ukraine s Leaders and Europe s Russian Oil Addiction

మరోవైపు జెనీవాలో చర్చలు ప్రారంభం కాకముందు.. ఉక్రెయిన్ అధ్యక్షుడు కీలక ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య రక్తపాతం తగ్గాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్చలు సఫలీకృతం కావాలని అభిప్రాయపడ్డారు. పాజిటివ్ రిజల్ట్ వస్తుందని భావిస్తున్నట్లు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+