Ben Stokes: ఆ విధ్వంసకరుడు వచ్చేస్తున్నాడు.. రాజస్థాన్‌కు అదనపు బలం..!

రాజస్థాన్ రాయల్స్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఆ మాటకొస్తే బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంజాయ్ చేసే వారందరికీ ఇది గుడ్ న్యూస్ అవుతుంది. ఇప్పటికే కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్... జట్టులో చేరేందుకు ఈ రాత్రికి దుబాయ్ చేరుకోనున్నాడు. ఇంతకాలం తన తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతుండటంతో ఆయనకు తోడుగా న్యూజిలాండ్‌లోనే ఉన్న ఈ డ్యాషింగ్ ఆల్‌రౌండర్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో చేరేందుకు దుబాయ్‌కి బయలు దేరాడు.

జట్టులో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ చేరుతాడనే వార్తలు

జట్టులో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ చేరుతాడనే వార్తలు

కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ చేరుతాడనే వార్తలు వినిపించాయి. ఆ జట్టు మెంటార్‌గా వ్యవహరిస్తున్న షేన్‌వార్న్ ఈ విషయంపై చిన్న హింట్ ఇచ్చారు. ఇక ఇప్పుడే మంచి ఫామ్‌లో ఉన్న జట్టులో బెన్ స్టోక్స్ ఎంట్రీ ఇస్తే ఆ జట్టు మరింత బలోపేతంగా తయారవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దుబాయ్‌కు చేరుకున్న వెంటనే బెన్ స్టోక్స్ కోవిడ్-19 ప్రక్రియను పాటించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా 36 గంటల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది.

 36 గంటలు క్వారంటైన్‌లో

36 గంటలు క్వారంటైన్‌లో

దుబాయ్‌కు చేరుకోగానే 36 గంటలు క్వారంటైన్‌లో ఉంటాడు బెన్‌స్టోక్స్. అయితే నిబంధనలు మాత్రం 6 రోజుల పాటు ఉండాలని సూచిస్తున్నాయి. ఈ సమయంలోనే మరోసారి కరోనావైరస్ టెస్టులు నిర్వహిస్తారు. స్టోక్స్ చేరికతో రాజస్థాన్ రాయల్స్ మిడిల్ ఆర్డర్ బలోపేతం అవుతుంది. ఇటు బౌలింగ్‌ విభాగం కూడా బలోపేతం అవుతుంది. ఇప్పటి వరకు రాజస్థాన్ రాయల్స్ మూడు మ్యాచ్‌లు ఆడగా అందులో రెండు మ్యాచ్‌లను గెలిచింది. బెన్ స్టోక్స్ లేకపోవడంతో మిడిల్ ఆర్డర్ కాస్త బలహీనంగా కనిపించింది. రాబిన్ ఊతప్ప రియాన్ పరాగ్‌లు జట్టులో చేరినప్పటికీ బెన్ స్టోక్స్ లేని లోటును వీరు పూడ్చలేకపోయారు. ఇక బంతితో కూడా అద్భుతాలు చేయగల బెన్ స్టోక్స్... ప్రత్యర్థి జట్టును బంతితో కట్టడి చేయగల సత్తా ఉంది.

తండ్రి క్యాన్సర్‌తో

తండ్రి క్యాన్సర్‌తో

మొత్తానికి దుబాయ్‌కు చేరుకోగానే ఒకటి రెండు మ్యాచ్‌లకు స్టోక్స్ దూరమైనప్పటికీ అతని చేరికే జట్టుకు సగం బలం ఇస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. తన తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతున్నాడన్న వార్త తెలిసినప్పుడు స్టోక్స్ పాకిస్తాన్‌తో జరగుతున్న సిరీస్‌లో ఆడుతున్నాడు. ఈ వార్త తెలియగానే నేరుగా న్యూజిలాండ్‌కు బయలుదేరి వెళ్లి పోయాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+