వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020: బౌండరీ సైజు తగ్గించండి... సీనియర్స్‌కు కష్టమవుతోంది: ధోనీ జట్టు విజ్ఞప్తి

|
Google Oneindia TeluguNews

దుబాయ్, అబుదాబి స్టేడియంలోని బౌండరీల దూరాన్ని తగ్గించాలని చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు విజ్ఞప్తి చేసింది. ఆ గ్రౌండ్‌లో ఉన్న అధిక ఉష్ణోగ్రత పరిస్థితులు కారణంగా తమ సీనియర్ ఆటగాళ్లు ఫీల్డింగ్, బ్యాటింగ్ చేయలేక ఇబ్బంది పడుతున్నారని పేర్కొంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఇప్పటి వరకు సీఎస్‌కే ఆడిన 6 మ్యాచ్‌ల్లో సెకండ్ బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు మిడిలార్డర్ వైఫల్యంతోనే వరుస పరాజయాలను చవిచూసింది. టాపార్డర్ సహాయం లేకుండా లక్ష్యాన్ని చేధించలేకపోతుంది.

ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్న సీఎస్‌కే.. తదుపరి మ్యాచ్‌లకైనా.. బౌండరీ సైజ్ తగ్గిస్తే తమ ఆటగాళ్లకు మేలు జరుగుతుందని భావిస్తోంది. మైదానమంతా పరుగెత్తాల్సిన అవసరం ఉండదని, ఆ ఉక్కపోతలో తమ శక్తి సామర్థ్యాలను కాపాడుకుంటారని, అందరూ 30 ఏళ్లకు పైగానే ఉన్న ఆటగాళ్లని సీఎస్‌కే తమ విజ్ఞప్తిలో పేర్కొంది. ఇక సీఎస్‌కే ప్రతిపాదనకు రాజస్థాన్ రాయల్స్ కూడా మద్దతు తెలిపింది. ముఖ్యంగా ఆ జట్టు బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్‌లు సీఎస్‌కే రిక్వెస్ట్ లెటర్‌పై సంతకం చేశారు. గౌతమ్ గంభీర్ కూడా సంజూ శాంసన్ కోసం ఈ ప్రతిపాదనకు ఒకే చెప్పాలని జైషాతో లాబియింగ్ చేస్తున్నాడు.

IPL 2020: CSK requests IPL governing body to reduce the boundary size,Trollings on Dhoni team

ఇదిలా ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు కేదార్ జాదవ్‌పై ఇంకా ట్రోలింగ్స్ ఆగడం లేదు. ఆఖరికి బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్ కూడా కేదార్ జాదవ్‌ ఆట తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. అతనికి గాయమైందని చెప్పి పక్కన కూర్చోపెట్టాలని సూచించాడు. సల్మాన్‌కు కేదార్ జాదవ్‌కు వీరాభిమాని కాగా.. అతను ఇలానే ఆడితే సూపర్ మ్యాన్ సల్మాన్ ఖాన్ కా ఫ్యాన్ అని తనను ఎగతాళి చేస్తారని, తన బ్రాండ్ విలువకు ముప్పని సల్మాన్ భాయ్ చింతిస్తున్నాడు.

పైన పేర్కొన్నదంతా నిజమనుకుంటున్నారా... అస్సలు కాదు. చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లపై ట్విటర్ వేదికగా పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. ఆ ట్రోలింగ్స్‌కు సంబంధించే ఈ వార్తంతా. .. (ఈ కథనం ఎవరినీ కించపరిచేందుకు కాదు . తక్కువ చేసే ఉద్దేశం అంతకన్నా కాదు. జస్ట్ ఫన్ కోసం మాత్రమే..)

Recommended Video

IPL 2020 : Lungi Ngidi Given A Hint That He Is Unhappy At Chennai Super Kings | Oneindia Telugu

English summary
Trollings on CSK and Rajasthan Royals are making rounds on social media that CSK had met the IPL governing body and requested to reduce the boundary size.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X