రిషభ్ పంత్‌లో నిక్కర్లు వేసుకునే చేష్టలు పోలేదట: యువరాజ్ తిట్టాడా? పొగిడాడా? వెరైటీ విషెస్

న్యూఢిల్లీ: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌ సందర్భంగా క్రికెట్ ప్రేమికులను ఆకట్టుకునే బ్యాట్స్‌మెన్లలో ఒకడు.. రిషభ్ పంత్. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా అతను తన స్థాయికి తగ్గ గేమ్‌ను ఆడలేదు. క్రీజులో ఉన్నంత సేపూ భారీ షాట్లతో ఆలరిస్తున్నప్పటికీ.. సుదీర్ఘ ఇన్నింగ్‌ను ఆడలేకపోతున్నాడు. దూకుడుగా ఆడే క్రమంలో తన వికెట్‌ను కోల్పోతున్నాడనే కామెంట్స్ ఉన్నాయి అతని మీద. ఈ సీజన్‌లో షార్జా ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి కోల్‌కత నైట్ రైడర్స్‌పై చేసిన 38 పరుగులే అతని టాప్ స్కోర్.

రిషభ్‌కు ఎన్నేళ్లో తెలుసా?

ఆదివారం రిషభ్ పంత్ పుట్టినరోజు. 23 సంవత్సరాలు నిండాయి. ఈ సందర్భంగా అతనికి క్రీడా ప్రపంచం నుంచి కుప్పలు తెప్పలుగా పుట్టినరోజు శుభాకాంక్షలు అందుతున్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ), భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీ), ఢిల్లీ కేపిటల్స్ టీమ్ ఫ్రాంఛైజీ, మేనేజ్‌మెంట్ రిషభ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాయి. పలువురు మాజీ క్రికెటర్లు, టీమ్ మేట్స్, అభిమానులు రిషభ్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు. వాటన్నింటిలోనూ గుర్తుండి పోయే విధంగా వెరైటీగా అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.

నిక్కర్లు వేసుకునే చేష్టలు..

జిస్ కా నామ్ హై పంత్.. లేకిన్ హర్కతే హై నిక్కర్ వాలీ.. అంటూ విష్ చేశాడు. ఇంత ఏజ్ వచ్చినా నిక్కర్లు వేసుకునే రోజుల నాటి చేష్టలు మాత్రం ఇంకా పోలేదనేది దాని సారాంశం. అంతర్జాతీయ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తోన్న రిషభ్ పంత్.. తనకు మాత్రం ఇంకా నిక్కర్లు వేసుకునే చిన్నపిల్లవాడిగానే కనిపిస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అతని శుభాకాంక్షలు తెలిపాడు. ఐపీఎల్‌లో మరింత అద్బుతంగా రాణించాలని అకాంక్షించాడు. ఈ మేరకు తన విషెస్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రిషభ్‌తో దిగిన ఫొటోను దానికి యాడ్ చేశాడు.

నాలుగు మ్యాచుల్లో..

ఈ ఐపీఎల్ సీజన్‌లో రిషభ్ పంత్ ఇప్పటిదాకా నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. 134 పరుగులు చేశాడు. షార్జా ఇంటర్నేషనల్ స్టేడియంలో కోల్‌కత నైట్ రైడర్స్‌పై చేసిన 38 పరుగులే ఇప్పటిదాకా అతని టాప్ స్కోర్. ఈ నాలుగు మ్యాచ్‌లల్లో 136.73 స్ట్రైక్ రేట్‌ను నమోదు చేశాడంటే.. ఎంత దూకుడుగా అతను ఆడుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. 44.66 బ్యాటింగ్ సగటుతో కొనసాగుతున్నాడు. మొత్తం ఐపీఎల్ ఎడిషన్లను పరిగణనలోకి తీసుకుంటే.. 58 మ్యాచ్‌లను ఆడిన అతను 1870 పరుగులు చేశాడు. ఈ సీజన్ ముగిసే సరికి రెండువేల పరుగుల మార్క్‌ను అందుకునే అవకాశాలు లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+