ఐపీఎల్ వేళ.. విరాట్ కోహ్లీ-అనూష్క శర్మ సంచలనం..!!
ముంబై: ఇంకొద్ది రోజుల్లో ఇండియన్ ప్రీిమియర్ లీగ్ 2023 (IPL 2023) 16వ సీజన్ ఆరంభం కాబోతోంది. రెండున్నర నెలల పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ (Cricket) అభిమానులను ఉర్రూతలూగించబోతోందీ మెగా క్రికెట్ టోర్నమెంట్. మే ఈ ఈవెంట్ కోసం ఫ్రాంఛైజీలన్నీ సన్నద్ధం అయ్యాయి. ఐపీఎల్ 2023 (IPL 2023) ఛాంపియన్ గా ఆవిర్భవించడానికి మొత్తం 10 జట్లు పోటీ పడనున్నాయి. ఈ ఏడాది కప్ విన్నర్ ఎవరనేది తేలాలంటే రెండున్నర నెలల పాటు ఎదురుచూడాల్సి ఉంటుంది.

31న గ్రాండ్ గా..
ఈ నెల 31వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్ మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. గత సీజన్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ (Gujarat Titans).. సెకెండ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో ఢీ కొట్టబోతోంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. గుజరాత్ టైటన్స్ కు హార్దిక్ పాండ్యా (Hardik Pandya), సీఎస్‌కే (CSK)కు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)- సారథ్యాన్ని వహిస్తోన్నారు.

కోహ్లీ నిర్ణయం..
21వ తేదీన చివరి లీగ్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore)- గుజరాత్ టైటాన్స్ ఈ మ్యాచ్ లో తలపడతాయి. కాగా ఆర్సీబీ (RCB)కి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న విరాట్ కోహ్లీ (Virat Kohli) కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. తన భార్య, బాలీవుడ్ నటి అనూష్క శర్మ (Anushka Sharma) తో కలిసి ప్రత్యేకంగా ఓ ఫౌండేషన్ ను స్థాపించారు. పేదలకు తగిన ఆర్థిక, ఇతర సహాయ కార్యక్రమాలను చేపట్టాలనే ఉద్దేశంతో ఉమ్మడిగా దీన్ని నెలకొల్పారు.

సేవ పేరుతో..
వారిద్దరూ ఉమ్మడిగా నెలకొల్పిన ఈ నాన్ ప్రాఫిటబుల్ ఫౌండేషన్ పేరు సేవ (SeVVA). ఇదివరకు భార్యభర్తలిద్దరూ వేర్వేరుగా నాన్ ప్రాఫిటబుల్ ఎన్జీఓ సంఘాలను నడిపించేవారు. ఇప్పుడా రెండింటినీ విలీనం చేశారు. సేవ పేరుతో కొత్తగా ఫౌండేషన్ ను ప్రారంభించారు. సమాజంలో అసమానతలు ఉన్నాయని, వాటిని కొంతమేరకైనా తొలగించాలనేదే తమ లక్ష్యమని, సేవ ఫౌండేషన్ లక్ష్యం కూడా అదేనని వారు వివరించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

తిరుగులేని కోహ్లీ..
ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ తిరుగులేని రికార్డును కొనసాగిస్తోన్న విషయం తెలిసిందే. 2008 నుంచి ఇప్పటివరకు ప్రతి సీజన్ లోనూ ఆడుతూ వస్తోన్నాడీ రన్ మెషీన్. ఇప్పటివరకు 223 మ్యాచ్ లను ఆడాడు. 6,624 పరుగులు చేశాడు. ఇందులో అయిదు సెంచరీలు ఉన్నాయి. 44 హాఫ్ సెంచరీలను నమోదు చేశాడు. వ్యక్తిగత అత్యధిక పరుగులు 113. 129.15 స్ట్రైక్ రేట్ ను నిలకడగా కొనసాగించడం అంటే మాటలు కాదు. 2016 సీజన్ లో అత్యధికంగా 973 పరుగులు చేశాడు కోహ్లీ.












Click it and Unblock the Notifications