జగిత్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గంగవ్వ సంబరపడింది: గృహ ప్రవేశం చేసిన యూట్యూబ్ స్టార్..

|
Google Oneindia TeluguNews

యూట్యూబ్ స్టార్ గంగవ్వ చిరకాల స్వప్నం నెరవేర్చుకుంది. కొత్తగా నిర్మించుకున్న ఇంట్లోకి గంగవ్వ గృహప్రవేశం చేసింది. బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఇంట్లో అడుగుపెట్టిన గంగవ్వ.. ఐదు వారాల్లో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. అనారోగ్య కారణంగా అప్పుడు ఇంట్లో నుంచి బయటకి రావాల్సి వచ్చిన గంగవ్వ.. తన చిరకాల కోరికను హోస్ట్ నాగార్జున ముందు పెట్టింది. నాగార్జున గంగవ్వకి ఇల్లు కట్టిస్తానని.. ఆ బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చినట్లుగానే నాగార్జున బిగ్ బాస్ షో నుండి ఆమెకి ఇంటికి సహాయసహకారాలు అందించారు.

ఆర్థికసాయం

ఆర్థికసాయం

బిగ్ బాస్ నుంచి గంగవ్వ ఇంటి కోసం రూ.11 లక్షల రూపాయలు అందినట్లు తెలుస్తోంది. గంగవ్వ మరో మూడు లక్షలు ఆమె చేతి డబ్బుతో మొత్తానికి ఆమె ఇంటి కల నెరవేర్చుకుంది. కొత్త ఇంట్లో గంగవ్వ గృహప్రవేశం చేయగా..కార్యక్రమానికి బిగ్‌బాస్‌ నాలుగో సీజన్ కంటెస్టెంట్లు కూడా హాజరయ్యారు. అఖిల్‌, శివజ్యోతితోపాటు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మై విలేజ్‌ షో టీం సభ్యులు సహా గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు.

వీడియో..

వీడియో..

గంగవ్వ గృహప్రవేశానికి సంబంధించిన వీడియోను మై విలేజ్‌ షో టీం యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయగా వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో యూట్యూబ్‌లో కాసేపటికే ట్రెం‍డింగ్‌లో నిలిచిందంటే గంగవ్వ క్రేజ్ ఏంటో తెలుసుకోవచ్చు. ఇక ఇప్పుడు గంగవ్వ యూట్యూబ్‌తోపాటు పలు సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా మారిపోతున్న సంగతి తెలిసిందే.

ఇలా ఫేమ్

ఇలా ఫేమ్

కొన్నాళ్ల కిందటి వరకు పల్లెటూరి మహిళగా ఉన్న గంగవ్వ... మై విలేజ్ షో యూట్యూబ్ చానల్‌తో ఎంతో పేరు తెచ్చుకుంది. ఆపై బిగ్ బాస్ రియాలిటీ షోతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ దగ్గరైంది. గంగవ్వ తన కల నెరవేర్చుకుంది. జగిత్యాల జిల్లా మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామంలో కొత్తగా నిర్మించుకున్న ఇంట్లోకి గృహప్రవేశం చేసింది.

 ఆకట్టుకున్న గంగవ్వ

ఆకట్టుకున్న గంగవ్వ

బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో గంగవ్వ ఎంట్రీ ఓ విచిత్రం. నగర వాతావరణానికి దూరంగా ఉండే గంగవ్వ వంటి మహిళకు బిగ్ బాస్ ఇంట్లో స్థానం కల్పిస్తారని ఎవరూ ఊహించలేదు. తన పల్లెటూరి యాస, కల్మషం లేని వ్యక్తిత్వంతో గంగవ్వ బిగ్ బాస్ ఇంటి సభ్యులనే కాదు, బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఆరోగ్యం దెబ్బతినడంతో మధ్యలోనే షో నుంచి బయటికి వచ్చేసింది.

నాగ్ సాయం..

నాగ్ సాయం..

సొంత ఇల్లు నిర్మించుకోవడం ఆమె కల అని తెలుసుకున్న హోస్ట్ నాగార్జున అందుకు సాయం చేస్తానని మాటిచ్చారు. మాట నిలుపుకుంటూ ఆయన రూ.7 లక్షలు అందించగా, బిగ్ బాస్ షో నుంచి రూ.11 లక్షలు, సొంత డబ్బు మరో రూ.3 లక్షలు కలుపుకుని తన స్వగ్రామంలో లంబాడిపల్లిలో అందమైన ఇంటిని నిర్మించుకుంది. సొంత ఇంట్లోకి ప్రవేశించిన క్షణాన గంగవ్వ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

English summary
youtube star gangavva Housewarming at jagtial district malyal mandal lambadi palli village.akhil, shiva jyothi are attended
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X