Viral Video: మేకలకు రెయిన్ కోట్లు.. వైరల్ అయిన వీడియో..
వర్షాల వల్ల మనుషలే కాదు జంతువులు కూడా ఇబ్బంది పడతాయి. ఇలా జంతవులు ఇబ్బంది పడడాన్ని చూసిన ఓ వ్యక్తి వాటికి రెయిన్ కోట్స్ వేశాడు. ఇది ఎక్కడో కాదు తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో జరిగింది. జిల్లాలోని అంతర్గాంకు చెందిన మీనయ్యకు మేకలు ఉన్నాయి. అతను వాటిని రోజూ బయటకు అంటే పొలాలు, గుట్టల్లోకి మేతకు తీసుకెళ్తాడు.

అయితే గతవారం ఎడతెరుపు లేకుండా కురిసిన వర్షాలకు అతను మేకలను బయటకు తీసుకెళ్లలేకపోయాడు. మేకలను ఎన్ని రోజులు మందలోనే ఉంచాలి.. బయటకు తీసుకెళ్దామని నిర్ణయించుకున్నాడు. అయితే అవి వర్షానికి తడిస్తే ఎలా అని ఆలోచించి వాటికి రెయిన్ కోట్లు కొని వేశాడు. మేకలు రెయిన్ కోట్ వేసి మేతకు తీసుకెళ్లాడు.
ఇలా చేయడం వల్ల వర్షానికి తవడకుండా ఉండడమే కాకుండా చలిని తట్టుకుంటాయని తెలిపాడు. అయితే మేకలకు రెయిన్ కోట్లు వేసి తీసుకెళ్తుంటే ఊర్లో వాళ్లు వింతగా చూశారు. వాటిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది.












Click it and Unblock the Notifications