గులాబీ బాస్ గిరిజన మంత్రిగా అవకాశం ఇస్తామన్నారట .. అయినా టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా రారట
తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ మొత్తం ఖాళీ అయినా ఆ ఒక్క నేత మాత్రం మిగిలారు. ఇక ఆయన టిడిపిని వీడి వచ్చేది లేదని మరోమారు తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని నేతలు ఎందరు టీడీపీని వద్దనుకున్నా, తనకు మాత్రం టీడీపీలోనే కొనసాగడం ఇష్టమన్నారు. ఇక గులాబీ బాస్ నుండి గిరిజన మంత్రిగా ఆఫర్ వచ్చినా అవసరం లేదని చెప్పారట సదరు టిడిపి ఎమ్మెల్యే. ఇంతకీ ఎవరో ఇప్పటికే అందరికీ అర్థమై ఉండాలి. ప్రస్తుతం టీడీపీ నుంచి తెలంగాణలో ఎమ్మెల్యేగా ఉన్నఒకే ఒక్కడు ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు .

తెలంగాణలో జరిగిన ముందస్తు ఎన్నికలలో టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందిన మెచ్చా నాగేశ్వరరావు , సండ్ర వెంకట వీరయ్య తో పాటుగా టిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని అందరూ భావించారు. కానీ ఆయన ఇప్పటి వరకు పార్టీ మారలేదు. అయితే.. తాజాగా మెచ్చా నాగేశ్వరరావు కేసీఆర్ తనకు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్‌లో చేరితే గిరిజన మంత్రి ఇస్తానని కేసీఆర్ చెప్పారని మెచ్చా పేర్కొన్నారు. అయితే టీఆర్ఎస్‌లో చేరడం ఇష్టలేదని.. టీడీపీలో కొనసాగడమే ఇష్టమన్నారు అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు .
డబ్బులు, పదవులకు లొంగే వ్యక్తిని కానని చెప్పిన మెచ్చా టిడిపిలో సింగిల్ గా అయినా సరే ఉంటానని వెల్లడించారు.












Click it and Unblock the Notifications