Holi special: మగువల్లా మగవాళ్ళు.. ఏపీలోని ఆ గ్రామంలో హోలీనాడు జంబలకిడి పంబ!!
హోలీ పండుగ సందర్భంగా సంతేకుడ్లూరు గ్రామంలో వింత ఆచారం కొనసాగుతోంది. పండుగ రోజున పురుషులందరూ స్త్రీల వేషధారణతో పూజలు చేస్తారు.
కర్నూలు: దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు జరుగుతున్నాయి. చిన్న, పెద్ద, పేద, ధనిక తేడా లేకుండా ప్రతి ఒక్కరు రంగుల పండుగను ఆనందోత్సాహాల నడుమను జరుపుకుంటున్నారు. హోలీ రోజు ఎవరైనా రంగులు చల్లుకుంటారు. రంగుల కేళి రంగేళి, సంబరాల హోలీ అంటూ ఆటపాటలతో ఆనందంగా గడుపుతారు. ఇష్టంలేని వారు హోలీకి దూరంగా ఉంటారు. కానీ హోలీ నాడు చాలా ప్రాంతాల్లో అనేక వింత ఆచారాలను కొనసాగిస్తున్నారు.
మగువల్లా ... మగవాళ్ళు ... హోలీ నాడు జంబలకిడి పంబ
ఇక కర్నూలు జిల్లాలోని ఆదోని మండలంలో మాత్రం హోలీ పండుగ నాడు మగవాళ్ళు ఆడవాళ్ళు అవుతారు. ఆ రోజు అక్కడ అచ్చం జంబలకిడి పంబ సినిమా చూసినట్టు ఉంటుంది. విచిత్రమైన ఆచారంతో అక్కడివారు హోలీ పండుగ నాడు సందడి చేస్తారు. రెండు రోజులపాటు సాగే ఈ వేడుకకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక ప్రత్యేకత ఏమిటంటే... కర్నూలు జిల్లాలోని ఆదోని మండలంలో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక సరిహద్దు బోర్డర్లో ఉండే సంతేకుడ్లురు గ్రామంలో హోలీ పండుగ రోజున వింత ఆచారం కొనసాగుతుంది. పండుగ రోజున పురుషులంతా ఆడవాళ్ళ వేషధారణలో రతీ మన్మధులను పూజిస్తారు. ఇలా పూజ చెయ్యటం వల్ల అంతా మంచి జరుగుతుందని వారు విశేషంగా నమ్ముతున్నారు.

చీరలు కట్టి అలంకరించుకుని పూజలు
స్త్రీల మాదిరిగా పురుషులంతా చీరలు కట్టుకొని, ఆభరణాలు పెట్టుకొని, చక్కగా అలంకరించుకొని అచ్చం అమ్మాయిల మాదిరిగా రెడీ అవుతారు. ఈ ఆచారం ఎంతోకాలంగా తరతరాల నుండి కొనసాగుతుందని, ఇలా చేయడం వల్ల గ్రామస్తులు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయని స్థానికులు చెబుతున్నారు. అయితే గ్రామం సుభిక్షంగా ఉండడానికి, పంటలు బాగా పండడానికి, గ్రామంలోని ప్రజలకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉండడానికి పురుషులు ఆడవాళ్ళ వేషధారణ వేసి పూజలు చేయడం ఆనవాయితీ అని వారు చెబుతున్నారు.

ఇతర రాష్ట్రాల నుండి ఈ వేడుకకు జనాలు
ఇక ఇక్కడ వారి ఈ విచిత్ర సాంప్రదాయాన్ని చూడడానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు కూడా ఇక్కడికి తరలి వస్తారని తెలుస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా, ఇక్కడికి వచ్చిన తర్వాత మహిళల వేషధారణలో దేవుడిని పూజిస్తారని చెబుతున్నారు. ఇది ఇక్కడి వారి తరతరాల సాంప్రదాయం అని అంటున్నారు. ఈ పండుగను రెండు రోజుల పాటు జరుపుకుంటారు. అత్యంత ఘనంగా మగవాళ్ళు అందరూ మగువలుగా మారి జరుపుకునే ఈ పండుగ ఆ గ్రామంలోని హోలీ స్పెషల్.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications