Lok sabha Election 2024 result:డైలీహంట్‌పై లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విశ్లేషణ,పూర్తి స్థాయి కవరేజ్

దేశవ్యాప్తంగా తారాస్థాయికి చేరిన ఉష్ణోగ్రతలు ఓ వైపు బెంబేలెత్తిస్తుండగా మరో వైపు పొలిటికల్ హీట్ పార్టీ నాయకులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఏప్రిల్ 19న ప్రారంభమైన తొలిదశ పోలింగ్ జూన్ 1వ తేదీ ఏడవ దశ పోలింగ్‌తో ముగిసింది.అదే రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి.దేశవ్యాప్తంగా తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే,ఇండియా కూటముల మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు పలు అంచనాలు వెలువడ్డాయి.ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి గెలిచి జాతీయ స్ధాయిలో హ్యాట్రిక్ సర్కార్ ఏర్పాటు చేయబోతోందా లేదా అన్నది జాతీయ మీడియా దాదాపుగా తేల్చేసింది.

ఒకట్రెండు ఎగ్జిట్ పోల్స్ మినహాయిస్తే దాదాపు అన్ని ఛానళ్లూ ఏకాభిప్రాయాన్నే వినిపించాయి. ప్రముఖ సర్వే సంస్థల్లో ఒకటైన జన్‌కీ బాత్ బీజేపీ కూటమికి 362-392 వస్తాయని అంచనా వేయగా..కాంగ్రెస్ కూటమి 141-161 సీట్లు, ఇతరులు 10 నుంచి 20 సీట్లు వస్తాయని జోస్యం చెప్పింది. మరో ప్రముఖ సంస్థ టైమ్స్ నౌ కూడా బీజేపీకి 353 నుంచి 368 సీట్లు వస్తాయని చెప్పగా.. కాంగ్రెస్‌ కూటమికి 118 నుంచి 133 సీట్లు వస్తాయని, ఇతరులకు 45-48 సీట్లు వస్తాయని వెల్లడించింది. జూన్ 4వ తేదీన ఇటు ఆయా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు లోక్‌సభ ఎన్నికల ఫలితాలు కూడా వెలువడతాయి.ఇక అన్ని రాజకీయ పార్టీలు ఫలితాల కోసం ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నాయి ఒక్క పార్టీలే కాదు దేశంలోని సామాన్య ప్రజలు సైతం రాజకీయ వేడి ఎలాగుందో చర్చించుకుంటున్నారు.

ఈ సారి లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఈ రాష్ట్రాల్లో అధికారం ప్రజలు ఎవరికి కట్టబెట్టనున్నారో అనే ఉత్కంఠ నెలకొంది. ఓ వైపు 300 పై చిలుకు స్థానాలు సాధించి మూడవ సారి తిరిగి అధికారంలోకి వస్తామంటూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే చెబుతుండగా... ప్రజలు తమకే పట్టం కడుతున్నారని కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తోంది. ఏది ఏమైనా ఈ సారి రెండు కూటముల మధ్య మాత్రం హోరాహోరీ పోరు జరిగే అవకాశాలున్నాయి.

Lok sabha election 2024 Results Get fastest updates and analysis only on daily hunt

డైలీ హంట్ పై కవరేజ్:

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆయా రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లైవ్‌తో సహా పూర్తి స్థాయిలో డైలీ హంట్ కవర్ చేస్తోంది. ఎన్నికలు కేవలం అంకెలతో మాత్రమే ముడిపడి ఉన్నాయనేది డైలీ హంట్ నమ్మదు.పూర్తి స్థాయి డేటా ఆధారంగా విశ్లేషించడం జరుగుతుంది.ఒక్కసారి ఫలితాలు రావడం ప్రారంభమయ్యాక, అన్ని కోణాల్లో సమగ్ర విశ్లేషణ ఇస్తాం. ఫలితాలపై డేటా సేకరించి ఫలితాలు ఎందుకు అలా వచ్చాయో విశ్లేషిస్తాం.

డైలీ హంట్‌కు లాగిన్ అయితే మీరు ఈ లాభాలు పొందుతారు:

లైవ్‌తో పాటు వేగవంతమైన ఎన్నికల అప్‌డేట్స్ చక్కటి టాబ్యులర్‌ ఫార్మాట్‌లో ఉంటాయి.

ఈ సారి ఫలితాలు గత ఫలితాలతో పోలుస్తూ విశ్లేషణలు

ఆయా నియోజకవర్గాల్లో సీట్ల మార్పులతో ఏ మేరకు ప్రభావం ఉందనేదానిపై అప్‌డేట్స్

సోషల్ మీడియాలో రియాక్షన్స్, ట్రెండ్స్, ట్విటర్ ట్రెండ్స్

లైవ్ వీడియోలు, వైరల్ మీమ్స్, ట్రెండింగ్ కథనాలు, వీడియోలతో డైలీ హంట్ పై మా ఎన్నికల కవరేజీ ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+